Ratan Tata And Shantanu Naidu Friendship: అపర కుబేరుడైన రతన్ టాటాకు ఫ్రెండ్స్ అంటే వీఐపీలు, వీవీఐపీలు ఇంకా రాజకీయ నాయకులు ఉంటారు అనుకుంటారు చాలా మంది. కానీ అది తప్పు. రతన్ టాటా బెస్ట్ ఫ్రెండ్ ఇదిగో 29 ఏళ్ల చిన్న కుర్రాడు. ఇతని పేరు శంతనునాయుడు. రతన్‌ టాటాకి పరిచయమయ్యేసరికి ఆ కుర్రాడి వయసు  జస్ట్ 18 సంవత్సరాలే. 


అలాంటి చనువు ఉన్న వ్యక్తి శంతను


స్నేహానికి వయస్సుతో పనిలేదని నిరూపించారు వీళ్లిద్దరు. టాటా భుజం మీద చేయి వేసి ఫోటోలు దిగే చనువు శంతను నాయుడుకే ఉంది అంటారు తెలిసినవాళ్లు. టాటా ట్రస్టు ఛైర్మన్‌గా ఉన్న రతన్ టాటాకు మేనేజర్‌గా 2018లో చేరడంతో శంతను నాయుడు గురించి అందరికీ తెలిసింది. కానీ టాటాకు ఇతని పరిచయం ఇంకా ముందుగానే జరిగింది. 


ఆ ఒక్క పనితో టాటాకు ఫ్రెండ్ అయిపోయి శంతను


2014లో పుణేలోని సావిత్రీబాయి పూలే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన శంతను తర్వాత మోటో పా అని ఓ వైల్డ్ హెల్ప్ స్టార్టప్ట్ ప్రారంభించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలకు గురి అవుతన్న జంతువులను సంరక్షించడంతోపాటు ఆ ప్రమాదాలు జరగకుండా చేస్తుందీ మోటో పా. ఇలా వీధికుక్కలను రక్షించడానికే ఒక వినూత్న ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. రాత్రిపూట రోడ్లపై తిరిగే కుక్కలు కనిపించేలా రిఫ్లెక్షన్ లైట్స్ బెల్ట్‌లను తొడిగే వాళ్లు. ప్రమాదాలు జరిగి అవయవాలు కోల్పోయిన వాటికి చికిత్స అందించే వాళ్లు. సరిగ్గా ఇదే పని రతన్ టాటాను శంతను నాయుడుకు దగ్గర చేసింది. 


ఫ్రెండ్‌ కాస్త మేనేజర్ అయ్యారు


తొలుత ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టడం అచ్చం తనలానే పెట్ లవర్ అయిన శంతనును అక్కున చేర్చుకున్నారు రతన్ టాటా. తర్వాత ఈ ఫ్రెండ్‌షిప్ ఎంతవరకూ వెళ్లిందంటే శంతను టాటా దగ్గరే అప్రెంటింస్ చేసి ఆయన ట్రస్ట్‌లోనే ఆయనకే మేనేజర్‌గా నియమితుడయ్యారు. 


Also Read: న్యూ ఐడియాల స్టార్టప్‌లకు బూస్టర్‌- మధ్యతరగతి ప్రజల సేవియర్ రతన్ టాటా


గుడ్‌ఫెలోస్‌లో టాటాల పెట్టుబడి


గుడ్‌ఫెలోస్‌ అనే స్టార్టప్‌ను కూడా శంతను స్థాపించారు. ఇది సీనియర్ సిటిజన్‌లకు మేలు చేసే స్టార్టప్. ఈ వెంచర్ విలువ రూ.5 కోట్లు. దీనిలో కూడా రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం టాటా ట్రస్ట్‌లోని ఆధ్వర్యంలోని స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ డైరెక్టర్ కూడా శంతను నాయుడే. 


రతన్ టాటాతో ఫ్రెండ్‌షిప్‌పై పుస్తకం రాసిన శంతను


టాటా బర్త్ డేకు కేక్స్ తినిపించటం, ఆయనతో కలిసి టైమ్ స్పెండ్ చేయడం, దేశంలో పరిశ్రమలు నడుస్తున్న తీరు, ప్రజల సమస్యలు, వాటిని సాల్వ్ చేసిన విధానం ఇలా ఎన్నో విషయాలను శంతనుకు నేర్పి ఓ భావి భారత నాయకుడిగా అతన్ని తీర్చిదిద్దారు రతన్ టాటా. టాటాతో తనకున్న అనుభవాలు, నేర్చుకున్న విషయాల మీద ఐ కేమ్ అపాన్ లైట్ హౌస్ అనే పుస్తకమే రాశాడు శంతన్ నాయుడు..


రతన్ టాాటా మరణంపై అందులేని ఆవేదనకు అక్షరూపం ఇచ్చిన శంతను


మీరు వెళ్లిపోవడంతో ఫ్రెండ్‌షిప్‌లో శూన్యం ఏర్పడింది. మీరు లేని లోటు అధిగమించేందుకు ఈ జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ప్రేమకు దూరమై కలుగుతున్న దుఃఖం పూడ్చలేనిది. గుడ్‌ బై.. మై డియర్‌ లైట్‌హౌస్‌’ అంటూ శంతను తన బాధను వ్యక్తం చేశారు. 


Also Read: భూరి విరాళాలు ఇవ్వడంలో దాన కర్ణుడు -మూగజీవాల కష్టం చూసి కన్నీళ్లు పెట్టేసుకునే కోటీశ్వరుడు