illionaire Made His Employees Millionaires When He Sold the Company :  అమెరికాలో స్కాలెర్ అనే ఓ సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ కంపెనీని యజమాని అమ్మేశారు. ఆయన బిలియనీర్ . కంపెనీని భారీ మొత్తం లాభానికి అమ్మేశారు. కానీ ఉద్యోగులు మాత్రం ఇక మా పరిస్థితి ఏమిటని గందరగోళంలో పడిపోయారు. అయితే తమ యజమానికి  తమను అలా రోడ్డున పడేయడం లేదని .. తమను కూడా మిలియనీర్లను చేశారని తెలిసే సరికి వారికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. 


భారత్ మూలాలున్న జే చౌదరి అనే వ్యక్తి అమెరికాలో టెక్ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన సౌంతంగా సెక్యూర్ ఐటీ అనే  కంపెనీని పెట్టారు. తన భార్య జ్యోతితో కలిసి ఆ కంపెనీని వృద్దిలోకి తెచ్చారు. అందులో 70  మంది ఉద్యోగులు పని చేసేవారు. ఓ సారి బడా కంపెనీ నుంచి తిరుగులేని ఆఫర్ వచ్చే సరికి ఆయన కంపెనీని అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన తనతో పాటు తన ఉద్యోగుల భవిష్యత్ గురించి కూడా ఆలోచించారు. కంపెనీ అమ్మే ప్రక్రియలో భాగంగా ఉద్యోగులందరికీ .. కొత్త కంపెనీలో షేర్లను ఇచ్చేలా ఒప్పంద చేసుకున్నారు.                         


ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఇన్‌కమ్‌పై ప్రభుత్వం ఆంక్షలు, అలాంటి పోస్ట్‌లు పెడితే జీవిత ఖైదు తప్పదు    


సెక్యూర్ ఐటీ కంపెనీని వెరిసైన్ అనే కంపెనీ టేకోవర్ చేసింది. ఈ సందర్భంగా కంపెనీ ఉద్యోగులకు షేర్లు లభించింది.   ఆ కంపెనీ షేర్లు ఊహించని విధంగా  పెరిగాయి. ఎంతగా అంటే.. ఆ కొద్దిపాటి షేర్లు ఉన్న ఉద్యోగులు..మాజీ ఉద్యోగులు బిలియనీర్లు అయిపోయారు. పెద్ద ఎత్తున ఇళ్లు , కార్లు కొనుక్కుని లైఫ్‌లో సెటిలైపోయారు. ఇది జరిగింది 1998లో. అయితే తర్వాత డాట్ కామ్ బూమ్ బద్దలైన తర్వాత మళ్లీ ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి. కానీ ఆయన తీసుకున్న నిర్ణయం కారణంగా  కంపెనీ ఉద్యోగులు బిలియనీర్లు అయిపోయారు.  


 Vehicle Discount: కొత్త కార్‌ కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్, ఇలా చేస్తే భారీ డిస్కౌంట్ మీ సొంతం


జే చౌధురి హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆయన చదువులు ఇండియాలోనే జరిగాయి. బనారస్ హిందూ యూనివర్శిటీలో  ఉన్నత విద్యనభ్యసించారు. ఐబీఎం, యూనిసిస్‌ వంటి కంపెనీల్లో పని చేసిన తర్వాత ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ నాస్ డాక్ లో కూడా లిస్ట్ అయింది. తర్వాత తన ఐటీ వెంచర్లను కొనసాగించారు. జే చౌదరి సక్సెస్ ఫుల్ ఐటీ ఎంట్రప్రెన్యూస్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన నెట్ వర్త్ పది వేల కోట్ల వరకూ ఉంటుందని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఆయన పెట్టిన కంపెనీల్ని  ఇతర పెద్ద పెద్ద కంపెనీలు భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసేవి.