Scrapped Vehicles: కొత్త కార్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? డిస్కౌంట్‌ కోసం చూస్తున్నారా..? అయితే...మీకో గుడ్ న్యూస్. భారీగా డిస్కౌంట్ వచ్చే ఓ ట్రిక్ చెప్తాం. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీయే స్వయంగా ఈ ఆఫర్ గురించి వివరించారు. ప్యాసింజర్‌ లేదా కమర్షియల్ వాహనాల్లో ఏదైనా సరే పాత వెహికిల్ ఉంటే చాలు. ఈ ఆఫర్ వర్తిస్తుంది. మీరు చేయాల్సిందల్లా పాత వెహికిల్‌ని ఇచ్చేయడమే. సింపుల్‌గా చెప్పాలంటే ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లాగా అన్నమాట. అయితే...ఎలా పడితే అలా ఇచ్చేయడానికి వీల్లేదు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్‌ని సబ్మిట్ చేస్తేనే ఈ డిస్కౌంట్ వస్తుంది. అంటే పాత వెహికిల్‌ని ఇచ్చేసి కొత్త వెహికిల్‌లో డిస్కౌంట్‌ పొందచ్చు. ఈ మేరకు ఆయా కంపెనీలు అంగీకరించినట్టు కూడా నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. స్క్రాప్‌ పాలసీలో భాగంగా పాత వెహికిల్స్‌ని ఇలా ఇచ్చేయాలనే ప్రతిపాదన కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫాక్చరర్స్ అసోసియేషన్ (SIAM) సీఈవోలతో గడ్కరీ భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వాహనాలు తయారు చేసే సంస్థలు ఇందుకు సానుకూలంగా స్పందించినట్టు ఆయన వెల్లడించారు. X వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. (Also Read: 2024 TVS Jupiter : ఫోన్ ఫీచర్స్‌తో వచ్చేసిన సరికొత్త టీవీఎస్‌ జూపిటర్‌.. కొత్తగా స్కూటర్‌ కొనేవారికి ది బెస్ట్)


"కొత్త వాహనాలు కొనే వాళ్లు పాత వాహనాలు ఇచ్చి భారీగా డిస్కౌంట్ పొందేలా చూడాలని ఓ ప్రతిపాదన తీసుకొచ్చాను. ఈ అభిప్రాయంపై కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ప్యాసింజర్ వెహికిల్స్‌తో పాటు కమర్షియల్ వెహికిల్స్‌కీ ఇది వర్తిస్తుంది. సరైన సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేస్తే ఈ డిస్కౌంట్‌ని పొందొచ్చు. ఈ నిర్ణయం ద్వారా రోడ్‌లపైకి వచ్చే వాహనాలు సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు. వాతావరణానికీ ఎలాంటి ఇబ్బంది కలగదు"


- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి


ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరైనా తమ పాత వాహనాన్ని ఇస్తే కొత్త వెహికిల్ కొన్నప్పుడు కనీసం 1.5-3.5% వరకూ డిస్కౌంట్ ఉండేలా చూస్తామని కంపెనీలు వెల్లడించాయి. అయితే..దేశవ్యాప్తంగా దాదాపు 1000 వెహికిల్ స్క్రాపింగ్ సెంటర్‌లతో పాటు 400 ఫిట్‌నెస్ సెంటర్‌లనూ ఏర్పాటు చేయాల్సిన అవసరముందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. 2021లో కేంద్ర ప్రభుత్వం National Vehicle Scrappage Policy రూపొందించింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అది అమల్లోకి వచ్చింది. పాత వాహనాలను స్క్రాప్ కింద వేస్తే కొత్త వాహనం కొన్నప్పుడు ట్యాక్స్‌లో కొంత రిబేట్ ఇచ్చేలా ఈ పాలసీ తయారు చేశారు. 15 ఏళ్లు పైబడిన వాహనాలను స్క్రాప్‌లా పరిగణిస్తారు. వీటికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప రోడ్డుపై నడిపేందుకు వీలుండదు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. ప్రస్తుతానికి ఫిట్‌నెస్ సెంటర్‌లు కాస్త తక్కువగా ఉండడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ సెంటర్‌ల సంఖ్య పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు ప్రజల్లోనూ అవగాహన పెంచుతోంది. పాత వాహనాలను వాడొద్దని సూచిస్తోంది. 


Also Read: Bengal Bandh: బెంగాల్ రాజకీయాల్లో దుమారం, బీజేపీ తృణమూల్‌ ఘర్షణలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తం