2024 TVS Jupiter 110 Top Features: టీవీఎస్‌ మోటార్ కంపెనీ జూపిటర్ 110 స్కూటర్‌ సరికొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ని ఆగస్ట్ 22న మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ అధునాతన స్కూటర్‌ అనేక డిజైన్, ఇతర స్మార్ట్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఇది ప్రస్తుత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆఫర్‌ల కంటే మెరుగైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ టీవీఎస్‌ జూపిటర్ కొన్ని సంవత్సరాలుగా టాప్‌ సెల్లింగ్‌ స్కూటర్‌గా ఉంది. తాజాగా ఈ కంపెనీ ప్రవేశ పెట్టిన అప్‌డేటెడ్‌ స్కూటర్లోని ఫీచర్లు మరియు డిజైన్ మార్పుల వివరాలు ఈ స్టోరీలో పరిశీలిద్దాం.

డిజైన్
2024 జూపిటర్ 110లో ముందు భాగంలోని హ్యాడింల్‌ బార్‌లో LED DRL, హెడ్‌లైట్, టర్న్ ఇండికేటర్‌లను కలిగి ఉంది. దీనిని కంపెనీ మార్పు చేసింది. రీడిజైన్ చేయబడిన బాడీ ప్యానెల్‌లలో ఫోన్‌ కోసం పాకెట్ లాంటి స్థలాన్ని, వస్తువులను తీసుకెళ్లడానికి సెంట్రల్ హుక్ ఉన్నాయి. అంతే కాకుండా ఇందులోని అండర్‌ సీట్‌ స్టోరేజీలో రెండు హాఫ్-ఫేస్ హెల్మెట్‌లకు క్యారీ చేయవచ్చు. 33 లీటర్ల అండర్‌సీట్‌ కెపాసిటీతో ఈ స్కూటర్‌ మరింత భారీ స్పేస్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది కొంతమంది కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుంది.


స్మార్ట్ ఫీచర్లు
ఈ స్కూటర్‌ బ్లూటూత్ కనెక్టివిటీతో కనెక్ట్‌ చేసేలా డిజిటల్ స్క్రీన్‌తో వస్తుంది. దీనిని TVS Smart-Exonect యాప్ ద్వారా యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇందులో టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, మెసెజ్‌ అలర్ట్స్‌ తెలుసుకోవచ్చు. అంతే కాకుండా వాయిస్ అసిస్ట్‌ ద్వారా యాక్సెస్ కూడా చేయవచ్చు. ఫైండ్ మి, ఫాలో మి హెడ్‌ల్యాంప్ ఫంక్షన్స్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.


సేఫ్టీ ఫీచర్లు
జూపిటర్ 110లో సరికొత్త టెక్నాలజీని అందించారు. మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయాల్లో ఇతర వాహనదారులను అలర్ట్‌ చేయడానికి అత్యవసర బ్లింక్‌ లైట్స్‌ని కలిగి ఉంటుంది. ఆకస్మిక బ్రేకింగ్ పరిస్థితుల్లో ఇది ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఆటోమేటిక్ ఇండికేటర్ షట్-ఆఫ్ ఆప్ష్‌ కూడా ఇందులో ఉంది. ఇది 100 మీటర్లు లేదా 20 సెకన్ల తర్వాత కాస్త నమ్మదిగా రెస్పాండ్‌ అవుతుంది. అంతే కాకుండా ఇందులో డిస్క్, డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఈ TVS కొస్త స్కూటర్‌ మెటల్ బాడీ ప్యానెల్‌ల్‌తో వస్తుంది.


Also Read: హైబ్రిడ్‌ వెర్షన్‌లో రానున్న ఫేమస్‌ కారు- ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌, మరెన్నో స్మార్ట్‌ ఫీచర్లు


ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌
ఈ స్కూటర్‌ 113 cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 8bhp వద్ద 9.8nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో iGO అసిస్ట్ ఫీచర్‌ను అందిచారు. ఇది మెరుగైన సామర్థ్యం కోసం ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ మోటారును ఉపయోగిస్తుంది. 110 cc సెగ్మెంట్‌లో ఈ మైక్రో-హైబ్రిడ్ టెక్నాలజీని పొందిన మొట్ట మొదటి స్కూటర్‌గా ఇది ఉంది.



వేరియంట్స్‌
కొత్త జూపిటర్ 110 నాలుగు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. డ్రమ్, డ్రమ్ అల్లాయ్, స్మార్ట్ కనెక్ట్ డ్రమ్, స్మార్ట్ కనెక్ట్ డిస్క్ వేరియంట్స్‌లో వస్తుంది. అంతే కాకుండా ఇది 6 కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తుంది. కస్టమర్‌లు తమకు నచ్చిన కలర్‌ ఆప్షన్‌ని ఒక్క రూపాయి ఎక్కువ చెల్లించకుండా ఎంచుకోవచ్చు. మెరుగైన డిజైన్, ఫీచర్లు, అధునాతన సాంకేతికతతో ఈ స్కూటర్‌ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 73,700 (ఎక్స్‌-షోరూమ్‌) ధరగా కంపెనీ నిర్ణయించింది.


Also Read: మహీంద్రా ఎక్స్‌యూవీ700పై భారీ తగ్గింపు - ఎంత తగ్గించారంటే?