Mahindra XUV700 Discount: మహీంద్రా ఎక్స్‌యూవీ700 భారతీయ మార్కెట్లో చాలా ప్రజాదరణ పొందింది. గత నెలలో ఈ ఎస్‌యూవీ 7,769 మంది వినియోగదారులను పొందింది. ఈ ఎస్‌యూవీ అమ్మకాలు స్కార్పియో, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో తర్వాత మూడో స్థానంలో నిలిచింది. మీరు కూడా మహీంద్రా ఎక్స్‌యూవీ700ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే మీకు ఒక గుడ్ న్యూస్. దాని అమ్మకాలను పెంచాలంటే కంపెనీ ఆగస్టు నెలలో ఎక్స్‌యూవీ700కి సంబంధించి ఏఎక్స్5, ఏఎక్స్3 వేరియంట్‌లపై పెద్ద తగ్గింపును ఇస్తోంది.


మీరు ఈ రెండు వేరియంట్లను కొనుగోలు చేస్తే రూ. 70,000 వరకు తగ్గింపు పొందుతారు. మహీంద్రా ఎక్స్‌యూవీ700పై కొనసాగుతున్న తగ్గింపు గురించి మరింత సమాచారం కోసం మీరు మీ సమీప డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. భారత మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి మొదలై రూ.26.04 లక్షల వరకు ఉంది.


మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఫీచర్లు ఇవే.. (Mahindra XUV700 Features)
ఫీచర్ల గురించి చెప్పాలంటే... మహీంద్రా ఎక్స్‌యూవీ700 డ్యూయల్ 10.25 అంగుళాల స్క్రీన్‌లను (ఇన్‌ఫోటైన్‌మెంట్ కోసం ఒకటి, ఇన్‌స్ట్రుమెంట్ ఫంక్షన్‌ల కోసం ఒకటి), వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అడ్రెనాక్స్ కనెక్ట్, అమెజాన్ అలెక్సా, స్కైరూఫ్, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌లు, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్‌ను పొందుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్స్‌తో ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్‌లు, కార్నరింగ్ ల్యాంప్స్, ఫుల్ సైజ్ వీల్ కవర్లు, ఎల్ఈడీ టైల్‌లైట్లు ఉండనున్నాయి.


Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?


శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఎక్స్‌యూవీ700
మహీంద్రా ఎక్స్‌యూవీ700... 5, 7 సీటర్ కాన్ఫిగరేషన్లు, మల్టీపుల్ ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఇందులో 2 లీటర్ టర్బోచార్జ్డ్ ఎంస్టాలియన్ పెట్రోల్ ఇంజన్ 200 హెచ్‌పీ శక్తిని, 380 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీని డీజిల్ వెర్షన్ 2.2 లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. ఇది రెండు విభిన్న ట్యూన్‌లలో లభిస్తుంది. 


ఈ ఇంజిన్‌లతో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో సహా రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ700 బేస్ స్పెక్ ఎంఎక్స్ ట్రిమ్ 6-స్పీడ్ మాన్యువల్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని ఇతర వేరియంట్‌లు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో వస్తాయి. మహీంద్రా ఏఎక్స్7, ఏఎక్స్7ఎల్ ట్రిమ్‌ల కోసం ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌లో కూడా ఎక్స్‌యూవీ700 కారు అందుబాటులో ఉంది. 


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే