New Social Media Policy: ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా సోషల్ మీడియా పాలసీ తీసుకొచ్చింది. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లోని కంటెంట్‌పై ఈ పాలసీ ద్వారా నిఘా పెట్టనుంది. అభ్యంతరకర పోస్ట్‌లు, కామెంట్స్ పెడితే చట్టపరంగా వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే కేబినెట్ ఈ పాలసీకి ఆమోదం తెలిపింది. ఈ కొత్త పాలసీ ప్రకారం ఎవరు అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టినా అది తీవ్రంగా నేరంగా పరిగణిస్తారు. ఆ కంటెంట్‌ని బట్టి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకూ విధించే అవకాశముంది.
ఈ మేరకు ఐటీ చట్టంలో కీలక మార్పులు చేర్పులు చేశారు. అంతకు ముందున్న సెక్షన్స్‌కి కొత్తగా కొన్ని నిబంధనలు జోడించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ని దుర్వినియోగపరిస్తే తీవ్ర పరిణామాలుండేలా ఈ మార్పులు చేశారు. అంతే కాదు. చట్టపరంగా ఎక్కడా ఏ విధంగాతప్పించుకునే వీల్లేకుండా చాలా పటిష్ఠంగా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. ఈ మేరకు యోగి సర్కార్ V-Form అనే ఓ డిజిటల్ ఏజెన్సీకి సోషల్ మీడియా కంటెంట్‌ని పరిశీలించే బాధ్యతలు అప్పగించింది. సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే వీడియోలు, ట్వీట్‌లు, పోస్ట్‌లు, రీల్స్‌పై ఈ సంస్థ నిఘా పెడుతుంది.
ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఆదాయంపైనా కొరడా..!
సోషల్ మీడియా ద్వారా చాలా మంజి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు చేతి నిండా సంపాదిస్తున్నారు. అయితే...వీళ్లు కూడా ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ పెట్టి సంపాదించుకోకుండా ఆంక్షలు విధించింది ప్రభుత్వం. నెలవారీ ఆదాయానికి పరిమితులు పెట్టింది. X, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకు రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలకు మించి చెల్లింపులకు వీల్లేదని తేల్చి చెప్పింది. ఇక యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు నెలకి రూ.8 లక్షలకు మించి చెల్లింపులు చేయడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. వీడియోలకు గరిష్ఠంగా రూ.8 లక్షలు మాత్రమే చెల్లించాలని స్పష్టం చేసింది. (Also Read: Rameshwaram Cafe Blast: రైళ్లలో బాంబులు పెట్టి పేల్చేస్తాం, రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి వార్నింగ్ - వీడియో విడుదల)
కొంత మంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కంటెంట్ కోసం విపరీత చేష్టలు చేస్తున్నారు. ప్రమాదకర స్టంట్‌లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్ పెరుగుతోంది. లైక్స్, షేర్‌ల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇటీవలే ఓ యువతి సెల్ఫీ దిగితూ 70 అడుగుల లోయలో పడిపోయింది. స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. అంతకు ముందు మరో యువతి ఇలానే ప్రమాదానికి గురై మృతి చెందింది. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అని చెప్పుకుని కాస్త అశ్లీల కంటెంట్ కూడా అప్‌లోడ్ చేస్తున్నారు కొంత మంది. వీటిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాపైనా నిఘా ఉండాల్సిన అవసరముందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యోగి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Vehicle Discount: కొత్త కార్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్, ఇలా చేస్తే భారీ డిస్కౌంట్ మీ సొంతం