Attack on Trains in India: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన ఒక్కసారిగా అలజడి సృష్టించింది. ఓ టిఫిన్ బాక్స్‌లో బాంబు పెట్టి పేల్చారు. ఈ పేలుడుకి పాకిస్థాన్‌లోని ISI కి లింక్ ఉన్నట్టు CBI ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలోనే ఇదే ఉగ్రసంస్థకు చెందిన ఓ టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరి ఓ వీడియో విడుదల చేశాడు. భారత్‌లోని రైళ్లలో దాడులు చేసేందుకు స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు. ప్రస్తుతానికి పాకిస్థాన్‌లో ఉంటున్న ఫర్హతుల్లా ఇండియాలో అశాంతి రేపేందుకు కుట్ర చేస్తున్నాడు. రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కూడా ఇతని చేయించిందే. ఓ స్లీపర్ సెల్ ద్వారా బాంబు దాడి చేయించాడు. ఎన్నో ఏళ్లుగా భారత్‌లోని నిఘా సంస్థలు ఫర్హతుల్లాని ఓ కంట కనిపెడుతున్నాయి. భారత్‌లోని రైల్వే నెట్‌వర్క్‌ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు స్లీపర్ సెల్స్‌లను వినియోగిస్తామంటూ ఓ వీడియో రిలీజ్ చేయడం సంచలనమవుతోంది. ప్రెజర్ కుక్కర్స్ వినియోగించి ఈ దాడులు చేస్తామని చెప్పాడు. అంతే కాదు. పెట్రో పైప్‌లైన్‌లనూ టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించాడు.
హిందూ నేతలనూ హతమారుస్తానని వార్నింగ్ ఇచ్చాడు. భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్‌ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని, వాళ్లని లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐలో దాడులు చేయిస్తోందని అన్నాడు ఫర్హతుల్లా. త్వరలోనే ప్రభుత్వాన్ని కుదిపేస్తామంటూ స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చాడు. ప్రాథమిక సమాచారం ఆధారంగా చూస్తే ఈ వీడియోని మూడు వారాల క్రితమే విడుదల చేశాడు. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. NIA ఈ కేసుని టేకప్ చేసింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసింది. అందులో ఒకరు మాస్టర్‌మైండ్ కాగా మరొకరు బాంబు పెట్టాడు. కోల్‌కతాలోని ఓ లాడ్జ్‌లో దాక్కుని ఉండగా NIA అధికారులు సోదాలు చేసి అరెస్ట్ చేశారు. ఫర్హతుల్లా ఘోరితో పాటు అతని అల్లుడు షాహిద్ ఫైజల్‌కి దక్షిణ భారత దేశంలో స్లీపర్ సెల్ నెట్‌వర్క్ భారీగా ఉందని గుర్తించారు. ఫైజల్ రామేశ్వరం కేఫ్‌లో నిందితులిద్దరితోనూ తరచూ మాట్లాడాడు.
Also Read: Bengal Bandh: బెంగాల్ రాజకీయాల్లో దుమారం, బీజేపీ తృణమూల్ ఘర్షణలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తం