Tasty Lunch Box Recipe : మీకు టేస్టీగా ఏదైనా ఫుడ్ తినాలనుకున్నప్పుడు రోటీ లేదా రైస్​లోకి.. రసంలోకి దేనిలోకైనా సెట్​ అయ్యే ఫుడ్​ రెసిపీ ఇక్కడుంది. అదే శనగపప్పు కొబ్బరి ఫ్రై. దీనిని చాలామంది ఇష్టపడతారు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు ఇష్టంగా తీసుకోగలిగే ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే రుచి బాగా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - 1 కప్పు 

నీరు - రెండు కప్పులు

Continues below advertisement

ఉప్పు - రుచికి తగినంత 

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - అర టీస్పూన్

జీలకర్ర - అర టీస్పూన్

మినపప్పు - 1 టీస్పూన్ 

కరివేపాకు - రెండు రెమ్మలు

వెల్లుల్లి రెబ్బలు - 5 

మిరపకాయలు - 3

పచ్చిమిర్చి - 3

అల్లం - అంగుళం

పసుపు - చిటికెడు

ఇంగువ - చిటికెడు

కొబ్బరి - 1 కప్పు

తయారీ విధానం

ముందుగా శనగపప్పును కడిగి.. నీటిని పూర్తిగా తీసేయాలి. దానిలో ఒకటింప్పావు కప్పు నీరు వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల శనగపప్పు వల్ల కలిగే కడుపు ఉబ్బరం వంటివి రావు. ఇలా నానబెట్టుకుని అనంతరం స్టౌవ్ వెలిగించి దానిపై గిన్నె పెట్టి శనగపప్పుని ఉడికించాలి. మూతలేకుండా ఉడికిస్తే మంచిది. ఉడికించేప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే రుచి మంచిగా ఉంటుంది. పప్పు ఉడికిపోవాలి. కాస్త పలుకు ఉన్నప్పుడే దించేయాలి. అప్పుడే తినడానికి మంచిగా ఉంటుంది. పప్పు అడుగు పట్టి మాడిపోకుండా చూసుకోవాలి. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేయాలి. లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు. అది కాగిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి వేగుతున్నప్పుడు మినపప్పు వేయాలి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత వెల్లుల్లిని దంచి వేయాలి. అనంతరం ఎండుమిర్చి వేయాలి. మినపప్పు మంచిగా రోస్ట్ అయినాక దానిలో పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కరివేపాకు కరకరలాడేలా వేయించుకోవాలి. దీనిలో అల్లం తురుము వేసుకోవాలి. దానిని కాస్త వేయించాక పసుపు వేసి మరో అరసెకను వేసి ఫ్రై చేసుకోవాలి. 

తాళింపు మంచిగా అరోమా వచ్చిన తర్వాత  దానిలో ఉడికించిన శనగపప్పు వేసి కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు కొబ్బరి తురుము వేయాలి. కొబ్బరి కాస్త ఉడికిన తర్వాత ఉప్పును రీచెక్ చేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ టేస్టీ శనగపప్పు కొబ్బరి ఫ్రై రెడీ. దీనిని ఇలా తినేయొచ్చు. లేదంటే దానిపై నిమ్మరసం చల్లి కలుపుకోవచ్చు. దీనిని అన్నంలో కలిపి తినొచ్చు. రసంలో తింటే ఇంకా బాగుంటుంది. 

ఈ టేస్టీ రెసిపీని రైస్​, రోటీలలోకి తీసుకోవచ్చు. లంచ్ బాక్స్​లోకి అయితే ఇది బెస్ట్ ఆప్షన్. ఆఫీస్​లకు వెళ్లేవారికి, కాలేజ్​లకు, స్కూళ్లకు వెళ్లేవారికి లంచ్​కోసం దీనిని ప్రిపేర్ చేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ టేస్టీ కర్రీని తయారు చేసుకోండి. 

Also Read : టేస్టీ, స్పైసీ దొండకాయ పచ్చడి.. ఇలా చేసుకుని తింటే ఎంతైనా లాగించేస్తారు..