అదో లగ్జరీ కార్ల షోరూమ్. సాదాసీదా లుక్‌తో ఉన్న వ్యక్తి వచ్చి కార్లను చూసి మురిసిపోతుడున్నాడు. ఇంతలో సేల్స్ మేన్ వచ్చి .." బయటకు పోవయ్యా " అని కసురుకున్నాడు. కారు కొనడానికి వచ్చానని అతనుచెపపిన మాటల్ని వెటకారంగా తీసుకున్నారు. జేబులో పది రూపాయలు ఉంటే చూపించు అంటూ సెటైర్లు వేసి బయటకు పంపేశాడు. అయితే వెంటనే వ్యక్తి రూ. పది లక్షలు తెచ్చి వెంటనే కారు కొంటా.. తక్షణం డెలివరీ ఇవ్వకపోతే అప్పుడు చెబుతానని వెళ్లిపోయాడు. 


Also Read: ప్లేటులో బాతు మెడ వంటకం... ఎలా తినాలంటూ తిట్టిపోస్తున్న నెటిజన్లు, లండన్ రెస్టారెంట్ చెత్త ప్రయోగం


కానీ సేల్స్ మేన్ సీరియస్‌గా తీసుకోలేదు. పది నిమిషాల్లోనే అతి ఫేట్ తిరగబడిపోయింది. ఆ వ్యక్తి రూ. పది లక్షలు ఉన్న చేతి సంచితో తిరిగి వచ్చాడు. ఆ డబ్బు సేల్స్ మేన్ ముందు పెట్టి... తనకు కార్ డెలివరీ చేయాలన్నాడు. కానీ సేల్స్ మ్యాన్ నోట మాట రాలేదు. ఎందుకంటే డెలివరీకి కారు రెడీగా లేదు. రెండు రోజుల సమయం కావాలని అడిగాడు. ఇంత అవమానించి. చాలెంజ్ చేసేలా చేసిన సేల్స్‌మేన్ డెలివరీకి వాహనం లేదుంటే  మరి ఆ వ్యక్తి ఊరుకుంటాడా..  సమస్యే లేదు... అక్కడ ఆత్మగౌరవం సమస్య ఉంది. అందుకే తక్షణం వెళ్లి రూ. పది లక్షలు తెచ్చాడు. వెంటనే గొడవ పెట్టుకున్నాడు. ఏం చెప్పాలో.. ఎలా చెప్పాలో తెలియక సేల్స్‌మెన్ కంగారు పడిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 


Also read: ఎత్తుతోనే ఆత్మవిశ్వాసం... మంచి ఎత్తు పెరగాలంటే పిల్లలకు పెట్టాల్సిన ఆహారాలు ఇవే


అచ్చంగా సినిమా సీన్ తరహాలో జరిగిన ఈ ఘటన కర్ణాటకలోని తుంకూరులో జరిగింది. సవాల్ చేసిన నిమిషాల్లో రూ. పది లక్షలు తెచ్చిన వ్యక్తిని తుంకూరుకు చెందిన వక్కపొడి రైతు కెంపెగౌడగా గుర్తించారు. అతనికి మహింద్రా కంపెనీ ధార్ కారు కొనాలని గట్టి కోరిక . దాని కోసమే షోరూంకు వెళ్లాడు. కానీ అతని ఆహార్యాన్ని చూసి కారు షోరం సేల్స్‌మెన్ తప్పు చేశాడు ఇరుక్కుపోయాడు. 


Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో


మహింద్రాకు సంబంధించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఆ సంస్థ చైర్మన్ ఆనంద్ మహింద్రా చురుగ్గా స్పందిస్తూంటారు. ఈ ఘటనపై ఇంకా స్పందించలేదు. బహుశా ఆయన దృష్టికి వెళ్లి ఉండదు. వెళ్తే ..ఓ మహింద్రా కారును రైతు ఇంటికి పంపుతారేమో? ఎందుకంటే రైతుకు అవమానం జరిగింది ఆయన షోరూమ్‌లో మరి ! 









ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.