ఉదయాన లేచిన వెంటనే ఒక కప్పు కాఫీ లేదా ఒక కప్పు టీ పొట్టలో పడిపోవాలి. ఆ కప్పులో ఒక స్పూను పంచదార కూడా కలుపుతారు మళ్లీ. సాయంత్రం మళ్లీ కాఫీ లేదా టీ విత్ పంచదార. అంటే మీకు తెలియకుండానే మీరు రెండు స్పూన్ల పంచదార తినేశారు. మధ్యమధ్యలో తియ్యని చిరుతిళ్లు తింటే దాని ద్వారా కూడా పంచదార ఒంట్లో చేరుతుంది. ఇలా రోజుల తరబడి కొనసాగితే శరీరం అనారోగ్యాలకు ఆశ్రయంగా మారుతుంది. 


నలభై కిలోలు తినేస్తున్నారు
ఒక టీస్పూన్ చక్కెర రోజుకు రెండుస్పూన్లు తింటున్నారు అనుకుందాం. 365 రోజులకు లెక్కగడితే దాదాపు నాలుగు పంచదార అవుతుంది. పదేళ్లకు 40 కిలోలు అవుతుంది. పదేళ్లలో తిన్న పంచదార ఎఫెక్ట్ పడకుండా ఉంటుందా? అనేక రకాల రోగాల రూపంలో బయటికి వస్తుంది. రోజూ ఇలా పంచదార తినడం భవిష్యత్తులో వచ్చే రోగాల జాబితా ఇదిగో...


1. బరువు త్వరగా పెరుగుతారు. అందులో మీరు రోజూ తినే పంచదార పాత్ర చాలా ముఖ్యమైనది. 
2. చక్కెర రోజూ తినేవారు గుండె జబ్బుల బారిన పడే అవకాశం రెండు రెట్లు ఎక్కువ అని ఒక అధ్యయనం చెబుతోంది. చక్కెర మీ రక్తపోటును పెంచుతుంది. లేదా రక్తప్రవాహంలోకి అధికంగా కొవ్వులను విడుదల చేస్తుంది. ఈ రెండూ కూడా గుండెపోటును, స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. 
3. వయసు పెరిగాక చక్కెర పానీయాలు టైప్ 2 మధ్యమేహం వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. అధిక బరువుతో ఉన్నవాళ్లలో  మధుమేహం వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ. 
4. ఉప్పు మాత్రమే కాదు, చక్కెర వల్ల కూడా రక్తపోటు కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇన్సులిన్ స్థాయిలను ఎక్కువగా పెంచడం ద్వారా చక్కెర రక్తపోటును పెంచుతుంది. 
5. చక్కెర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలోని చెడు కొవ్వులైన ట్రైగ్లిజరైడ్స్ ను అధికం చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు వస్తాయి. 
6. మన తినే ఆహారాలలో కూడా చక్కెర ఉంటుంది. ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఆహారంలో. మళ్లీ అదనంగా చక్కెర తినడం వల్ల ఆ ప్రభావం కాలేయంపై పడుతుంది. కాలేయం చక్కెరను కొవ్వుగా మారుస్తుంది. అదనంగా కూడా చక్కెర తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే నాన్ ఆల్కాహాలిక్ లివర్ డిసీజ్ అంటారు. 
7. శరీరంలోనికి చక్కెర అధికంగా చేరితే నిద్ర సరిగా పట్టదు. రక్తంలో చేరిన ఈ చక్కెర గ్లూకోజ్ స్థాయిలను అధికం చేస్తుంది. ఇది రాత్రిళ్లు నిద్రరాకుండా చేసి పగలు పనుల్లో ఉన్నప్పుడు నిద్ర వచ్చేలా చేస్తుంది. 
8. మూడ్ స్వింగ్స్ కూడా అధికంగా వచ్చేలా చేస్తుంది. చక్కెర అధికంగా తినే మగవారిలో 23 శాతం మందిలో యాంగ్జయిటీ, డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. 


ఇంకా ఎన్నో మార్పులు, సమస్యలు శరీరంలో కలిగే అవకాశం ఉంది. కాబట్టి కాఫీ, టీలలో పంచదార వేసుకోవడం మానేయడం ఉత్తమం. స్వీట్ చిరుతిళ్లు తినడం తగ్గించుకోవాలి. 


Also read: సరోగసీ పద్ధతిలో మాతృత్వాన్ని పొందుతున్న సెలెబ్రిటీలు... ఏంటి పద్ధతి? ఈ ప్రక్రియలో పిల్లలను కనడం అంత సులువా?


Also read: రాగిపాత్రలలో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆ క్యాన్సర్‌ను అడ్డుకోవచ్చు... ఆయుర్వేదం, సైన్స్ కలిపి చెబుతున్నదిదే








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.