2022 జనవరి 23 ఆదివారం రాశిఫలాలు

మేషంఈ రోజు కుజుడు, చంద్రుని సంచారం రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు శుభప్రదం. వ్యాపారంలో కొత్తగా ట్రైచేసిన వారిని విజయం వరిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది.  తెలుపు ,ఎరుపు రంగులు మంచివి. అవసరమైన వారికి సాయం చేయండి. 

వృషభంగురు, చంద్రుడు సంచారం కారణంగా మీకు మంచి బుద్ధి ఉంటుంది. శుభకార్యాలకు సహాయం చేస్తారు.  నూతన వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. మీకు తెలుగు, ఆకుపచ్చ రంగులు కలిసొస్తాయి. శనిగ్రహ ప్రభావం తగ్గించుకునేందుకు నువ్వులు దానం చేయండి. ఇంటి పెద్దల ఆశీశ్సులు తీసుకోండి. ప్రయాణం చేసే అవకాసం ఉంది. 

మిథునంఈ రోజంతా మీకు బావుంటుంది.  వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు.  తెలుపు మరియు నీలం రంగులు మీకు మంచివి. ఆరోగ్య సంబంధిత సమస్యలు దూరమవుతాయి. పని ప్రదేశంలో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. 

కర్కాటకంవిద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారంలో విజయం సాధించే అవకాశం ఉంది. చంద్రుని సంచారం ఉద్యోగంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. అలసట ఉండొచ్చు.

Also Read:  ముసలం అంటారు కదా.. మొదట అదెక్కడ పుట్టిందో తెలుసా..సింహంఉద్యోగాలు చేసే వారికి కలిసొచ్చే సమయం. రాజకీయ వ్యక్తులు లాభపడతారు. అపరిచితులతో జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. 

కన్యవ్యాపారంలో విజయంతో ఆనందం పెరుగుతుంది. ఈ రాశిలో చంద్రుని సంచారము ఆర్థిక లాభాన్నిస్తుంది. ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా గౌరవం అందుకుంటారు. ఎవరికైనా వస్త్రాలు దానం చేయండి. 

తులవ్యాపారాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. నిలిచిపోయిన డబ్బు అందుతుంది. అధికారులతో మనస్పర్థలు రావచ్చు. గాయత్రీ మంత్రాన్ని జపించండి. సూర్యభగవానుని ఆరాధించడం వల్ల మేలు జరుగుతుంది.

వృశ్చికం వ్యాపారంలో మందగమనం ఉంటుంది. ప్రయాణం చేయొచ్చు. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. మీరు కార్యాలయంలో శుభవార్తలను అందుకుంటారు.  స్నేహితులతో సమయం గడపగలుగుతారు.

Also Read:  కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?ధనుస్సు ఈ రోజు రాజకీయ నాయకులకు మంచి రోజు. నిరుద్యోగులు ఉద్యోగ సంబంధించిన సమచారం అందుకుంటారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. 

మకరంశని, చంద్రుడి స్థానం కారణంగా వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఎవరిపైనా నోరు పారేసుకోవద్దు. ఆంజనేయుడిని ప్రార్థించండి. 

కుంభంసూర్యుడు, బృహస్పతి ఈ రాశిలో ఉండటం వల్ల అన్ని వర్గాల వారూ లాభపడతారు.  వ్యాపార, ఆర్థిక సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. స్నేహితులను కలుస్తారు, ఇంటికి అతిథులు వస్తారు. 

మీనం ఈరోజు మీకు సాధారణంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. కంటి వ్యాధులు రావచ్చు. ఎవరినీ దుర్భాషలాడవద్దు. కుటుంబంతో సంతోష సమయం గడపండి. 

Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి