5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మెుదట 15వ తేదీ వరకు విధించిన ఈ నిషేధాన్ని ఆ తర్వాత ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. తాజాగా ఈ నెల 31 వరకు నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా అమలులో ఉన్న నిషేధ ఆజ్ఞల్ని మరోసారి పొడిగించింది. అయితే కొన్ని సడలింపులు మాత్రం ఇచ్చింది.


తాజా ఆదేశాల ప్రకారం.. మెుదటి విడత ఎన్నికలకు పోటీలో ఉన్న అభ్యర్థులు జనవరి 28 నుంచి బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. అయితే నిబంధనలు తప్పనిసరి పాటించాలి. రెండో దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1 నుంచి బహిరంగ సభలకు అనుమతినిచ్చింది. ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేవారు ఎక్కువ మంది ఉండకూడదని... కేవలం ఐదు నుంచి 10 మందికి పెంచింది.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈ నెల 8వ తేదీన ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని తొలుత ఈ నెల 15వ తేదీ వరకు ప్రకటించింది. మరోసారి పొడిగించిన నిషేధం జనవరి 22తో ముగిసింది.


తాజాగా వర్చువల్.. సమావేశంలో మళ్లీ పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయడానికి కార్యకర్తల సంఖ్యను ఐదు వరకే పరిమితం చేసింది.  ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధాన్ని మరో వారం పాటు పొడిగించింది. దీనికోసం ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ, వైద్యరంగ నిపుణులు, రాష్ట్రాల్లో ఎన్నికల కమిషనర్లతో  సమాలోచనలు జరిగాయి.


Also Read: UP Cong CM Face: ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమే.. స్వయంగా ప్రకటించిన ప్రియాంక!


Also Read: UP Election 2022: తండ్రి ములాయం సింగ్ కంచుకోట నుంచే అఖిలేశ్ యాదవ్ పోటీ


Also Read: UP Election 2022: యూపీ ఎన్నికల్లో విక్రమార్కుడు.. 74 ఏళ్లలో 94వ సారి పోటీ.. సెంచరీ కొట్టే వరకు తగ్గేదేలే!


Also Read: UP Election 2022: ఊ అన్న అఖిలేశ్ యాదవ్.. యూపీ ఎన్నికల బరిలో ఇక సమరమే!


Also Read: Punjab Elections : పంజాబ్‌లో డ్యూటీ ఎక్కిన ఈడీ..! ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై ఈ దాడులు తప్పవా ?