ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కాక రేపుతున్నాయి. ఓవైపు జంపింగ్ జపాంగ్‌లు పార్టీలు మారుతుంటే.. మరోవైపు కీలక నేతలు తాము పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తున్నారు. ఇలాంటి ఎన్నికల వేడిలో ఓ పెద్దాయన 94వ సారి ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అవును.. అక్షరాలా 93 సార్లు వివిధ ఎన్నికల్లో హసనురామ్ అంబేడ్కరీ పోటీ చేశారు. అయితే అన్ని సార్లు పరాజయమే వరించింది. అయినా సరే ఓటముల్లో సెంచరీ రికార్డ్ కొట్టేవరకు పోటీ చేస్తూనే ఉంటానంటున్నారు.
ఎవరీ ఈయన?
హసనురామ్ అంబేడ్కరీ.. ఓ సాధారణ వ్యవసాయ కూలీ. ప్రస్తుతం ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయన ఇప్పటి వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో 93 సార్లు పోటీ చేశారు.100 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రికార్డు సృష్టించాలని భావిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆగ్రాలోని ఖేరాఘర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
93 ఇలా..
- హసనురామ్ అంబేడ్కరీ.. కాన్షీరామ్ స్థాపించిన ఆల్ ఇండియా బ్యాక్‌వర్డ్ అండ్ మైనారిటీ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (BAMCEF)లో సభ్యుడు.
- ఆయన 1985 నుంచి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ, పంచాయితీ ఎన్నికలతో పాటు వివిధ ఎన్నికల్లో, వివిధ స్థానాల నుంచి పోటీ చేశారు.
- ఆయన 1988లో భారత రాష్ట్రపతి పదవికి తన నామినేషన్ పత్రాలను కూడా సమర్పించారు. అయితే ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ స్థానాల నుంచి పోటీ చేశారు.
- 2021లో జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు.
అదే ఉత్సాహం..
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు