ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్2 సైలెంట్‌గా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో 10వ తరం ఇంటెల్ ఐ3 నుంచి ఐ7 వరకు ప్రాసెసర్లను అందించారు. 16 జీబీ ర్యామ్, 14 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 512 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. దీని బరువు కేవలం 1.24 కేజీలు మాత్రమే. డీటీఎస్ సౌండ్ టెక్నాలజీ కూడా ఇందులో అందించారు.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్2 ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఇంటెల్ కోర్ ఐ3 వేరియంట్ ధర 399 యూరోలుగా (సుమారు రూ.29,700) ఉంది. ఇక ఐ5 వేరియంట్ ధర 549 యూరోలుగానూ (సుమారు రూ.40,900), ఐ7 వేరియంట్ ధర 649 యూరోలుగానూ (సుమారు రూ.48,300) నిర్ణయించారు. ప్రస్తుతానికి ఈ ల్యాప్‌టాప్ ఈజిప్ట్, ఇండోనేషియా, థాయ్‌ల్యాండ్‌ల్లో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్2 స్పెసిఫికేషన్లు
విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది. ఇందులో 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 16:9గా ఉంది. దీని వ్యూయింగ్ యాంగిల్ కూడా 178 డిగ్రీలుగా ఉంది. ఇంటెల్ కోర్ ఐ3, ఐ5, ఐ7 పదో తరం ప్రాసెసర్లను ఇందులో అందించారు. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎం.2 ఎన్‌వీఎంఈ పీసీఐఈ 3.0 స్టోరేజ్ ఇందులో ఉంది.


డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, రెండు యూఎస్‌బీ 3.0 పోర్టులు, ఒక హెచ్‌డీఎంఐ 4.1 పోర్టు, ఎస్‌డీ కార్డు స్లాట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ డీటీఎస్ సౌండ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.


ఇందులో 50Wh బ్యాటరీని అందించారు. ఏకంగా ఒక రోజు బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుందని కంపెనీ అంటోంది. ఈ ల్యాప్‌టాప్ మందం 1.48 సెంటీమీటర్లు కాగా.. బరువు 1.24 కేజీలుగా ఉంది.


Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి