ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ మెయిన్‌పురి జిల్లా కర్హాల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.​ మెయిన్‌పురి ఎప్పటి నుంచో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవ్ కంచుకోటగా ఉంది. మెయిన్​పురి పార్లమెంట్​ నియోజకవర్గానికి సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


ముందు ఊఊ..


కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అఖిలేశ్ ప్రకటించారు. కానీ పార్టీ సభ్యులతో పలు దఫాలు చర్చించి బరిలోకి దిగడానికే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆజంగఢ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా అఖిలేశ్ యాదవ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం అఖిలేశ్ యాదవ్‌కు ఇదే తొలిసారి. 


2000లో తొలిసారి కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు అఖిలేశ్ యాదవ్. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి విజయం సాధించారు. 2012లో అఖిలేశ్ యాదవ్.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం అయ్యారు. 


7 విడతల్లో..


403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.


సర్వే ఫలితాలు..


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ఏబీపీ-సీ ఓటర్ ఒపీనియన్ నిర్వహించింది. దీంట్లో యూపీలో భాజపా తిరిగి అధికారం చేపట్టనున్నట్లు తేలింది. గత నాలుగు సర్వే ఫలితాల ప్రకారం భాజపా.. ఈ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయనుంది. కానీ సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.


జనవరి 6న చేసిన సర్వే ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా అధికారం చేపడుతుందని 49 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. 30 శాతం మంది ప్రజలు సమాజ్‌వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని 7 శాతం మంది ప్రజలు అన్నారు.


జనవరి 3న చేసిన సర్వేలో 44 శాతం మంది ప్రజలు.. యోగి ఆదిత్యనాథ్ తమకు ముఖ్యమంత్రిగా కావాలన్నారు. 32 శాతం మంది అఖిలేశ్ యాదవ్ సీఎం కావాలని తెలిపారు. 15 శాతం మంది మాత్రమే మాయావతి సీఎం కావాలని కోరారు.


Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!


Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి