దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడికి దిల్లీ సీఎం, ఆమ్‌ఆద్మీ అధినేత కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. తమ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలవాలని ఉత్పల్ పారికర్‌ను కోరారు.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి పోటీ చేసిన పనాజీ స్థానం టికెట్ ఇవ్వాలని ఉత్పల్ కోరగా భాజపా నిరాకరించింది. గురువారం మొత్తం 40 సీట్లకు గాను 34 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన భాజపా.. ఉత్పల్‌కు టికెట్ ఇవ్వలేదు. దీంతో కేజ్రీవాల్.. ఉత్పల్‌ను తమ పార్టీలో చేరాలని ట్వీట్ చేశారు.
శివసేన మద్దతు..
పనాజీలో స్వతంత్ర అభ్యర్థిగా ఉత్పల్ పారికర్ పోటీ చేస్తే మద్దతు ఇస్తామని శివసేన ఇటీవల పేర్కొంది. అయితే, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటంపై ఇప్పటి వరకు ఉత్పల్ పారికర్ స్పందించలేదు.
రెండో జాబితాలో..
ఇంకా భాజపా ఆరు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. మిగిలిన స్థానాల్లో ఉత్పల్ పారికర్‌కు పోటీ చేసే అవకాశం భాజపా ఇవ్వొచ్చు. కానీ తన తండ్రి పోటీ చేసిన పనాజీ స్థానంలోనే బరిలోకి దిగాలని ఉత్పల్ భావిస్తే.. కేజ్రీవాల్ ఆఫర్ స్వీకరిస్తారో లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగగుతారో చూడాలి.
గోవా అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 14న జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.
Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు