పీట్రాన్ మనదేశంలో అత్యంత చవకైన స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే పీట్రాన్ ఫోర్స్ ఎక్స్11. ఈ వాచ్‌లో బ్లూటూత్ 5.0 టెక్నాలజీని అందించారు. ఓనిక్స్ బ్లాక్, సూడ్ పింక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది.


అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


పీట్రాన్ ఫోర్స్ ఎక్స్11 ధర
ఈ స్మార్ట్ వాచ్ ధరను రూ.2,799గా నిర్ణయించారు. అయితే ఇది ప్రారంభ ధర. తర్వాత దీని ధర పెరిగే అవకాశం ఉంది. ఈ ఫోన్ అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం నిర్ణయించిన ధర గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్ ధర అయి ఉండవచ్చు. ఎందుకంటే దీని ఎమ్మార్పీ రూ.7,999గా ఉంది. రిపబ్లిక్ డే సేల్ తర్వాత ధర కొంచెం పెరగవచ్చు. తక్కువ ధరకే కావాలంటే అమెజాన్ రిపబ్లిక్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు.


పీట్రాన్ ఫోర్స్ ఎక్స్11 స్పెసిఫికేషన్లు
ఇందులో 1.7 అంగుళాల పెద్ద హెచ్‌డీ ఫుల్ టచ్ కలర్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో 2.5డీ కర్వ్‌డ్ డయల్‌ను అందించారు. అలోయ్ మెటల్ కేసింగ్ కూడా ఇందులో ఉంది. ఇందులో హెల్త్, వెల్‌నెస్ సెన్సార్లు కూడా ఉన్నాయి. హార్ట్ రేట్, ఇతర బాడీ ఫంక్షన్లను కూడా ఇది ట్రాక్ చేయనుంది.


ఇందులో ఏడు యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. కాల్స్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా అలెర్ట్స్ కూడా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. వైర్‌లెస్ కాలింగ్ ఫీచర్ కూడా ఈ ఫీచర్‌లో ఉంది. ఇందులో బ్లూటూత్ వీ5.0 ప్రాసెసర్‌ను అందించారు. బిల్ట్-ఇన్ మైక్రోఫోన్ కూడా ఇందులో ఉంది.


మూడు గంటల పాటు చార్జ్ చేస్తే ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఈ వాచ్ అందించనుంది. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లకు యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.


Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!


Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!


Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!


Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!


Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి