పుష్ప సినిమా హిందీ సినిమా కలెక్షన్లు వంద కోట్లకు దాటిపోయాయి. స్ట్రెయిట్ హిందీ సినిమాలు కూడా అంత భారీ కలెక్షన్లు ఇటీవల సాధించలేకపోతున్నాయి. కానీ పుష్ప మాత్రం మ్యాజిక్ చేసింది. కలెక్షన్లు సాధించం ఓ ఎత్తు కానీ.. అంతకు మించిన క్రేజ్ పుష్ప సొంతమయింది. మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని భారత ప్రభుత్వమే పుష్పను వాడుకుంది. ఇలా వాడుకోవడానికి కారణం సోషల్ మీడియాలో పుష్పకు వచ్చిన క్రేజే. పుష్ప కేంద్రంగా హల్ చల్ చేస్తున్న మీమ్సే. పుష్ప సినిమా అల్లు అర్జున్ నడక కాస్త డిఫరెంట్. ఓ కాలు.. ఓ చేయి గూని తరహాలో నడుస్తాడు. ఇప్పుడిది స్టైల్ అయిపోయింది. హిందీలో ఎంతో మంది ఈ స్టైల్‌తో మీమ్స్ , షార్ట్ వీడియోస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
హిందీలోనే కాదు గుజరాతీలను కూడా పుష్ప మేనరిజమ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అక్కడి యువత వీడియోలు చేసి వదులుతున్నారు.
గుజరాత్ ప్రో కబడ్డీ టీం కూడా పుష్పను ఇమిటేట్ చేసింది.
పుష్ప సైడ్ ఎఫెక్ట్ పేరుతో వైరల్ అవుతున్న వీడియోలకు లెక్కే లేదు.
పుష్పనే కాదు శ్రీవల్లి కూడా హిందీ జనాలను బాగా ఆకట్టుకుంది. శ్రీవల్లి ట్రేడ్ మార్క్ స్టెప్‌తో వీడియోలు తయారు చేస్తున్నారు జనం.
మొత్తంగా పుష్ప అయితే అటు బాక్సాఫీస్‌కే కాదు ఇటు సోషల్ మీడియాకు కూడా పార్టీ ఇచ్చేశాడని నెటిజన్లు జోకులేసుకుటున్నారు.
Also Read: సినిమా ఇండస్ట్రీలు "వుడ్"లు ఎలా అయ్యాయి? పూరీ చెప్పిన ఈ స్టోరీ ..కథ కాదు నిజం !