లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్(92) కు కరోనా సోకడంతో ఆమె ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై వదంతులు వస్తున్నాయి. లతా మంగేష్కర్ తన ఇంటి సిబ్బందిలో ఒకరి నుంచి వైరస్ బారిన పడ్డారు. లతా మంగేష్కర్ ఆరోగ్యంపై మీడియాలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లతా దీదీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజాగా ప్రకటన చేశారు. లతా మంగేష్కర్ ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. లతా మంగేష్కర్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో వైద్యులు ‘లతా ఆరోగ్యంపై ఊహాగానాలను ఆపమని’ అభ్యర్థించారు గాయని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని తెలియజేశారు.
ఆ ట్వీట్‌లో “లతా ఆరోగ్యంపై ఊహాగానాలను ఆపమని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నామని డాక్టర్ ప్రతీత్ సమదానీ ట్వీ్ట్ చేశారు. లతా దీదీ మునుపటి కంటే సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నామని లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు తెలిపారు. లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం లతా దీదీ న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఆమె ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. లతా మంగేష్కర్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్ ప్రతిత్ సమదానీ గతంలో ఏఎన్ఐతో మాట్లాడుతూ లతా దీదీ వృద్ధాప్యం కారణంగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు.
Also Read: ఐసీయూలోనే లతా మంగేష్కర్.. డాక్టర్లు ఏం అన్నారంటే?
లతా మంగేష్కర్ ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. లతా కుటుంబ సభ్యుల సందేశాన్ని వెల్లడించారు. ఆమెకు వైద్యం అందిస్తోన్న వైద్యుల ప్రకటనను ట్విట్ చేశారు. వదంతులు వ్యాప్తి చేయొద్దని లతా దీదీ కుటుంబ సభ్యులు కోరారు. ఆమె చికిత్సకు మెరుగ్గా స్పందిస్తున్నారని తెలిపారు. అన్నీ సహకరిస్తే త్వరలోనే ఇంటికి తిరిగి వస్తారన్నారు. ఈ సమయంలో వదంతులకు దూరంగా ఉండాలని అభ్యర్థించారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని స్మృతి ఇరానీ ట్విటర్ వేదికగా అభ్యర్థించారు.
Also Read: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!