టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నా.. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంతపై ఫోకస్ ఎక్కువైంది. ఆమె పెట్టే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లు, స్టేటస్ లు వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీ విడాకుల అనౌన్స్మెంట్ నోట్ ను డిలీట్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమె ఏ కారణంతో నోట్ ను డిలీట్ చేసిందో తెలియదు కానీ.. చైతుతో ఆమె మళ్లీ కలవడానికి ప్రయత్నిస్తుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 


ఈ విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ బ్యూటీ స్విట్జర్లాండ్‌లో ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ సామ్ చేస్తోన్న అడ్వెంచర్స్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. రీసెంట్ గా ఆమె స్కీంగ్(Skiing) చేసింది. మంచుతో కప్పి ఉన్న రహదారుల్లో సమంత ఏమాత్రం భయం లేకుండా.. ఎంతో అనుభవం ఉన్నట్లు స్కీంగ్ చేసింది. 


ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. బాగా వైరల్ అయింది. తాజాగా ఈ అడ్వెంచర్ వెనుకున్న స్టోరీ చెప్పుకొచ్చింది. తనకు ట్రైనింగ్ ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల గురించి సమంత చెప్పుకొచ్చింది. తను ప్రాణాలతో బ్రతికి ఉండడానికి కారణం వాళ్లే అంటూ ఓ ఫొటోని స్టేటస్ గా పెట్టింది. సమంతతో పాటు ఉన్న ఇద్దరూ కూడా ఫారెనర్స్. 


ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సమంత 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఆమె సరికొత్త పాత్రలో కనిపించబోతుంది. దీంతో పాటు శ్రీదేవి మూవీస్ లో ఓ సినిమా, అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఓకే చేసింది. బాలీవుడ్ లో కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది.








Also Read: ఓటీటీలో 'అఖండ' రికార్డ్.. 24 గంటలు గడవకముందే..


Also Read: చై-సామ్ విడాకులు.. ఆ చెత్త వార్తలు బాధపెట్టాయంటున్న నాగ్..



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి