ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (92) ఇంకా ఐసీయూలోనే ఉన్నారని ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్టర్ పండిట్ సందానీ మీడియాతో తెలిపారు. కొంచెం పెద్ద వయస్కురాలు కాబట్టి కరోనా నుంచి రికవర్ అవ్వడానికి కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆవిడ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనావైరస్ కారణంగా లతా మంగేష్కర్ గత వారం ఆస్పత్రిలో చేరారు.


లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని కోరుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్లు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలోనే లతా మంగేష్కర్ ఉన్నారు. మనం వేచి చూడాల్సిందే. ఇప్పుడే ఏం చెప్పినా కానీ అది తొందరపాటే అవుతుంది. త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. ఆమె ఆసుపత్రిలోనే మరో 10 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది' అని తెలిపారు. 

 

లతా మంగేష్కర్ సోదరి ఆశాభోంస్లే కూడా ఈ విషయంపై స్పందించారు. కరోనా పాజిటివ్ కావడంతో  అనుమతించడం లేదన్నారు. ఒక్కసారి హాస్పిటల్ కి వెళ్లినా కానీ కాంపౌండ్ లోకి అనుమతించలేదని.. కానీ ఆమె పరిస్థితి మెరుగుపడుతోందని తెలిపారు.