ఎత్తు ఒక వ్యక్తి రూపాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని రకాల ఉద్యోగాలకు ఎత్తు కూడా చాలా అసవరం. ఎత్తుగా ఉన్న వారిలో ఆత్మవిశ్వాసం కూడా అధికంగా ఉంటుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. పిల్లలకు జన్యుపరంగానే ఎత్తు కూడా సంక్రమిస్తుంది. కానీ చిన్నప్పటి జీవనశైలి, ఆహారం వంటివి కూడా ఎత్తును కొంచెం పెంచేందుకు సహకరిస్తాయి. పిల్లలకు ఎలాంటి ఆహారం తినిపించాలంటే...


సాల్మన్ చేపలు
మీరు మాంసాహారులు అయితే ఎత్తు పెరిగేందుకు సాల్మన్ చేప మంచి ఎంపిక. ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు చాలా సహకరిస్తాయి. మినరల్స్, ప్రోటీన్ కూడా ఎత్తు పెరిగేందుకు అవసరం. అవి కూడా సాల్మన్ చేపలో పుష్కలం. కాబట్టి పిల్లలకు వారానికోసారైనా సాల్మన్ చేప పెట్టేందుకు ప్రయత్నించండి. 


గుడ్లు
పాల లాగే గుడ్లు కూడా సంపూర్ణ ఆహారం. ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు, కాల్షియం ఇలా పిల్లల ఎత్తు పెరిగేందుకు అవసరమైనవన్నీ ఇందులో లభిస్తాయి. రోజుకో ఉడకబెట్టిన గుడ్డు తినిపిస్తే మంచిది. 


చిలగడదుంపలు
ఎర్రని చిలగడ దుంపలు జీర్ణశయంలో మంచి బ్యాక్టిరియా సంఖ్యను పెంచుతాయి. పెరిగే పిల్లలకు ఇది సూపర్ ఫుడ్. ఇందులో ఉండే విటమిన్ ఏ ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది. ఈ దుంపల్లో ఉండే ఫైబర్లు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. శారీరక విధుల్లో చురుకుదనం పెంచుతుంది. తద్వారా పొడవు పెరిగే అవకాశం ఉంది. 


బెర్రీజాతి పండ్లు
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు వంటి వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది కణాల పెరుగుదలకు, కణజాలాల మరమ్మత్తుకు చాలా ముఖ్యమైనది. బెర్రీ పండ్లలో ఉండే పైటో న్యూట్రియంట్స్ శరీర ఎదుగుదలకు మేలు చేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఆహారంలో వీటిని చేర్చాలి. రోజుకో స్ట్రాబెర్రీ పండు ఇచ్చిన చాలు. 


ఆకుకూరలు
టీనేజీ వయసు పిల్లల్లో పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆకుకూరలు ముందుంటాయి. వీటిలో లభించే విటమిన్లు ఎముకల సాంద్రతను మెరుగుపరుస్తాయి. వాటిని దృఢంగా మారుస్తాయి. పెరుగుతున్న పిల్లల పోషకాహార అవసరాలను తీర్చడానికి వారానికి రెండు సార్లు ఆకుకూరలను తినడం అవసరం. 


Also read: రోజుకు రెండు స్పూన్ల పంచదార తింటే చాలు... భవిష్యత్తులో వచ్చే అనారోగ్యాల చిట్టా ఇదిగో


Also read: సరోగసీ పద్ధతిలో మాతృత్వాన్ని పొందుతున్న సెలెబ్రిటీలు... ఏంటి పద్ధతి? ఈ ప్రక్రియలో పిల్లలను కనడం అంత సులువా?








ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.