Guns Seized In Delhi Airport: సాధారణంగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు చేసే తనిఖీల్లో అక్రమంగా తరలిస్తోన్న బంగారు దొరుకుతుంది. అయితే తాజాగా ఓ జంట వద్ద మాత్రం ఏకంగా సూట్‌కేస్‌ నిండా పిస్టల్స్‌ ఉండటం చూసి అధికారులు షాక్ అయ్యారు.


ఇదీ జరిగింది


దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ జంట వద్ద 45 పిస్టల్స్‌ ఉన్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. దీంతో వారిని అరెస్ట్‌ చేశారు. జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ అనే బార్యభర్తలు ఈ నెల 10న వియత్నాం నుంచి దిల్లీకి తిరిగి వచ్చారు.






జగ్జీత్‌ వద్ద ఉన్న రెండు ట్రాలీ బ్యాగుల్లో 45 పిస్టల్స్‌ ఉన్నట్లు గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ గన్స్‌పై ఆరా తీశారు. అయితే ఇవి తమవు కావని తన సోదరుడు మంజిత్ సింగ్ ఆ ట్రాలీ బ్యాగులను తనకు ఇచ్చినట్లు జగ్జీత్ సింగ్ తెలిపాడు. పారిస్‌ నుంచి విమానంలో వియత్నాం వచ్చి తన సోదరుడు ఈ ట్రాలీలు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. అయితే గతంలో టర్కీ నుంచి 25 పిస్టల్స్‌ను భారత్‌కు తీసుకొచ్చినట్లుగా దర్యాప్తులో ఆ జంట వెల్లడించింది.


కేసు నమోదు 






అయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)కు చెందిన ఉగ్రవాద నిరోధక విభాగం ఈ కేసుపై దర్యాప్తు జరుపుతోంది. దంపతులు జగ్జీత్ సింగ్, జస్విందర్ కౌర్ నుంచి స్వాధీనం చేసుకున్న 45 పిస్టల్స్ విలువ దాదాపు రూ.22.5 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వారిద్దరిని అరెస్ట్‌ చేసిన అధికారులు, గన్స్‌ అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Draupadi Murmu: రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళగా ద్రౌపది రికార్డ్ సృష్టిస్తారా? సిన్హా షాకిస్తారా?


Also Read: President Elections 2022: రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? ఏ రాష్ట్రానికి ఓట్ల విలువ ఎక్కువ?