Draupadi Murmu: 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? ప్రస్తుత లెక్కలు, వివిధ పార్టీలు తెలిపిన మద్దతు ప్రకారం ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అనూహ్యంగా షాకిస్తారా? అసలు ఎవరి బలాబలాలు ఏంటి? ఎవరు గెలిస్తే ఏ రికార్డులు ఉన్నాయి?

అభ్యర్థుల ప్రస్తుత పరిస్థితి 

  •      గెలవడానికి కావాల్సిన ఓట్ల విలువ (మెజారిటీ మార్క్) – 5,43,216

కూటమి

అభ్యర్థి

ఓట్ల విలువ

ఎన్‌డీఏ (NDA)

ద్రౌపది ముర్ము

6,63,634

విపక్షాలు (Opposition)

యశ్వంత్ సిన్హా

3,92,551

(12 జులై, 2022 లోపు పలానా అభ్యర్థికి తమ మద్దతు ఉందని ప్రకటించిన పార్టీల ప్రకటనల ఆధారంగా)

ఈ నంబర్లలో కాస్త తేడా ఉండే అవకాశం ఉంది: తక్కువ ఓటింగ్ ( ఎంపీ/ ఎమ్మెల్యేల గైర్హాజరు)

  •       ఏదైనా పార్టీ నిర్ణయం మార్చుకుంటే 
  •       చెల్లని ఓట్లు 

అభ్యర్థుల ప్రొఫైల్

  1. ద్రౌపది ముర్ము– ఎన్‌డీఏ అభ్యర్థి
  • రాష్ట్రం – ఒడిశా
  • గిరిజన వర్గానికి చెందిన మహిళ 
  • చదువు – BA (గ్రాడ్యుయేట్)
  • రాజకీయం జీవితం ఇలా మొదలు - కౌన్సిలర్‌గా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు. తర్వాత 1997 రాయ్‌రంగ్‌పుర్ ఎన్‌ఏసీ వైస్‌చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.  

ఎన్నికైతే 

  • గిరిజన వర్గానికి చెందిన తొలి రాష్ట్రపతి.
  • దేశ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పుట్టి, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ (పుట్టిన తేదీ: 20/06/1958)
  • రెండవ మహిళా రాష్ట్రపతి (ప్రతిభా పాటిల్ తర్వాత)

ఏఏ బాధ్యతలు నిర్వహించారు 

  • ఝార్ఖండ్ గవర్నర్– 2015 మే18 నుంచి 2021 జులై 13 వరకు

       (ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్) 

  • ఒడిశా అసెంబ్లీకి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక – రాయ్‌రంగ్‌పుర్ (ST) సీటు
  1. 12వ అసెంబ్లీ- (2000 - 2004)
  2. 13వ అసెంబ్లీ (2004 - 2009)
  • ఒడిశా శాసనసభ నుంచి 2007కు గాను ఉత్తమ ఎమ్మెల్యేగా నీల్‌కాంత్ అవార్డు అందుకున్నారు. 

ఒడిశా అసెంబ్లీ 

  1. రవాణా మంత్రి - 06/03/2000 నుంచి 06/08/2002
  2. మత్స్య, పశుసంవర్థకశాఖ- 06/08/2002 నుంచి 16/05/2004

 ఇంకా

  • 1979 నుంచి 1983 – ఒడిశా ఇరిగేషన్, పవర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్
  • 1994 నుంచి 1997 – రాయ్‌రంగ్‌పుర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో అధ్యాపకురాలు 
  • 2002 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా మెంబర్ 
  • 2006 నుంచి 2009 – భాజపా ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు
  • 2013 నుంచి 2015 - భాజపా ST మోర్చా సభ్యురాలు (జాతీయ కార్యదర్శి)

ఇతర వివరాలు:

  • పుట్టిన తేదీ– జున్ 20, 1958 (64 ఏళ్లు)
  • తండ్రి - కీ.శే. బిరాంచి నారాయణ్ తుడు
  • భర్త - శ్రీ శ్యామ్ చరణ్ ముర్ము
  • పిల్లలు – ముగ్గురు (ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె)
  • వృత్తి – రాజకీయాలు, సామాజిక సేవ
  • హాబీ: పుస్తకాలు చదవడం, కుట్లు, అల్లికలు
  1. యశ్వంత్ సిన్హా – విపక్షాల ఉమ్మడి అభ్యర్థి
  • యశ్వంత్ సిన్హా- 1937 నవంబర్ 6న పట్నాలో జన్మించారు.
  • 1958లో రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ తీసుకున్నారు. 
  • 1960లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు.
  • 1984లో ఐఏఎస్‌కు రాజీనామా చేసి జనతా పార్టీలో చేరారు.
  • 1986లో అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
  • 1990 నవంబర్ నుంచి 1991 జూన్ వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా చంద్రశేఖర్ కేబినెట్‌లో పనిచేశారు.
  • 1992 నుంచి 2018 వరకు భారతీయ జనతా పార్టీ (భాజపా)లో సభ్యుడిగా ఉన్నారు. 
  • 2002 జులై నుంచి 2004 మే వరు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 

- అమోద్ ప్రకాశ్ సింగ్ (ఎడిటోరియల్ రీసెర్చ్) ABP