Corona Cases: దేశంలో కరోనా కేసులు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. 23 మంది మృతి చెందారు. తాజాగా 14,413 మంది కరోనా నుంచి కోలుకున్నారు.






రికవరీ రేటు 98.55 శాతానికి చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసులు 0.24 శాతం ఉన్నాయి.



  • మొత్తం కరోనా కేసులు: 4,34,69,234

  • ‬మొత్తం మరణాలు: 5,25,139

  • ‬యాక్టివ్​ కేసులు: 1,07,189

  • మొత్తం రికవరీలు: 4,28,36,906


వ్యాక్సినేషన్







దేశంలో తాజాగా 11,67,503 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,97,74,71,041 కోట్లకు చేరింది. మరో 5,02,150 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.


కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని తెలిపింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ.


Also Read: Nupur Sharma Case: నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఫైర్- 'దేశానికి ఆమె క్షమాపణలు చెప్పాల్సిందే'


Also Read: Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?