Nupur Sharma Case: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ నేత నుపుర్ శర్మపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజలకు ఆమె క్షమాపణలు చెప్పాలని సుప్రీం తెలిపింది.
తనకు ఉన్న ప్రాణ హాని, అత్యాచార బెదిరింపులు వస్తున్నందున దేశవ్యాప్తంగా తనకు వ్యతిరేకంగా దాఖలైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీకి బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నుపుర్ శర్మ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా. భాజపా బహిష్కృత నేతపై సుప్రీం కోర్టు మండిపడింది.
ప్రాణ హానిపై
సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై నుపుర్ శర్మ తరఫు లాయర్ మణిందర్ సింగ్ స్పందిస్తూ ఆమెకు ప్రాణహాని ఉందని ధర్మాసనానికి తెలిపారు. మహ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. అయితే దీనిపై కూడా సుప్రీం కోర్టు ఫైర్ అయింది.
దిల్లీ పోలీసులపై
నుపుర్ శర్మపై ఫిర్యాదు నమోదై ఇన్ని రోజులు అవుతుంటే దిల్లీ పోలీసులు ఏం చేశారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
నుపుర్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ కేసులో సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని ఆమె తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.
Also Read: Indian Railways: సింగిల్ ఛాయ్‌కు రూ.70 వసూలు చేసిన రైల్వేశాఖ- ఎందుకో తెలుసా?