Parliament Monsoon session 2022 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జులై 18 నుంచి వర్షకాల సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్‌సభ సెక్రటేరియట్ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పార్లమెంటు ఉభయసభలు జులై 18 నుంచి సమావేశమవనుంది. జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు జరుగుతాయని ఆ ప్రకటనలో పేర్కొంది. వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ముగుస్తాయి.






గత వర్షాకాల సమావేశాల్లో 


పెగాసస్ స్నూపింగ్ కుంభకోణం, రైతుల నిరసనలు, ధరల పెరుగుదల, ముఖ్యంగా ఆటో ఇంధనాలపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంపై ప్రతిపక్షాలు ఉభయ సభలను అడ్డుకోవడంతో గత సంవత్సరం వర్షాకాల సమావేశాలు గంధరగోళ పరిస్థితుల్లో ముగిశాయి. 2021లో జరిగిన వర్షాకాల సమావేశాలు గత రెండు దశాబ్దాలలో కేవలం 21 శాతం ఉత్పాదకతతో మూడో అతి తక్కువ ప్రొడక్టివ్ లోక్‌సభ సెషన్‌గా నిలిచాయి. రాజ్యసభ 28 శాతం ఉత్పాదకతను నమోదు చేసింది. 1999 నుంచి ఇది ఎనిమిదో అతి తక్కువ ప్రొడక్టివ్ సెషన్.


Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!


చిట్టచివరి సమావేశాలు 


పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ఆగస్టు 12 వరకు నిర్వహించనున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 18 నుంచి ప్రారంభమై, ఆగస్టు 12 వరకూ కొనసాగించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) తేదీలను ఇటీవల ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు అనుగుణంగానే సమావేశాల తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్లమెంటు భవనంలో జరిగే చిట్టచివరి సమావేశాలు ఇవేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2022 శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. 


Also Read : Maharastra Politics : ప్రమాణస్వీకారంలోనూ ట్విస్టులు - సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్!


Also Read: Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే- భాజపా సంచలన నిర్ణయం