Maharashtra New CM: మహారాష్ట్ర రాజకీయంలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రకటించింది. ఈ మేరకు భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
ఏక్‌నాథ్ షిండే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత కేబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు. అయితే ఏక్‌నాథ్ షిండేకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుంది. - దేవేంద్ర ఫడణవీస్, భాజపా నేత
భాజపా పెద్ద మనుసు
నియోజకవర్గ సమస్యపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసేందుకు వెళ్లాం. కానీ మాకు కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి పదవిని నేను ఎన్నడూ ఆశించలేదు. కానీ భాజపా పెద్ద మనసుతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. - ఏక్‌నాథ్ షిండే, శివసేన రెబల్ నేత
షిండే ప్రొఫైల్
- మహా వికాశ్ అఘాడీ ప్రభుత్వంలో ఏక్‌నాథ్ షిండే.. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు.
- అనేక ప్రాంతాల్లో శివసేన పార్టీని బలోపేతం చేసిన నేతల్లో ఏక్‌నాథ్ ఒకరు.
- మహారాష్ట్ర అసెంబ్లీకి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు.
- 2004, 2009, 2014, 2019లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
- 2014లో శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు.
- అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా చేశారు.
- పార్టీలో ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. భారీ ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తుంటారు.
- ఏక్‌నాథ్ కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్‌సభ ఎంపీ. సోదరుడు ప్రకాశ్ షిండే కౌన్సిలర్‌గా ఉన్నారు.
Also Read: UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన
Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!