ABP  WhatsApp

UN Spokesperson on Zubair Arrest: జర్నలిస్ట్ జుబైర్ అరెస్ట్‌పై ఐక్యరాజ్య సమితి స్పందన

ABP Desam Updated at: 30 Jun 2022 03:59 PM (IST)
Edited By: Murali Krishna

UN Spokesperson on Zubair Arrest: ప్రముఖ జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్‌పై ఐరాస స్పందించింది.

(Image Source: PTI)

NEXT PREV

UN Spokesperson on Zubair Arrest: ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్ అరెస్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. పాత్రికేయుల అరెస్టులపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) స్పందించింది.


పత్రికల్లో రాసే రాతలు, చేసే ట్వీట్లకు అనుగుణంగా పాత్రికేయులను అరెస్ట్ చేయడం సరైనది కాదని అభిప్రాయపడింది. ఈ మేరకు జుబైర్ అరెస్ట్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ సమాధానమిచ్చారు.



ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం కల్పించాలి. అది చాలా ముఖ్యమని నా అభిప్రాయం. పత్రికల్లో రాసే రాతలు, సోషల్‌మీడియాలో చేసే ట్వీట్లు, ప్రసంగాలను బట్టి పాత్రికేయులను జైలుపాలు చేయొద్దు. ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచంలో ఎక్కడైనా ఈ సూత్రాన్ని పాటించాలి. తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచకుండా జర్నలిస్టును వేధింపులు గురి చేయవద్దు.                                                                         - స్టీఫెన్ డుజారిక్, ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి


పత్రికా స్వేచ్ఛ ఎక్కడ?


న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో కమిటీ ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజే) జుబైర్‌ అరెస్టును ఖండించింది. భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దిగజారుతుందనడానికి జుబైర్‌ అరెస్టు తాజా ఉదాహరణ అని సీపీజే ఆసియా ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ స్టీవెన్‌ బట్లర్‌ అన్నారు.


జుబైర్ అరెస్ట్


2018లో జుబైర్ చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జూన్ 27న జుబైర్‌ను అరెస్ట్ చేశారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 


ఇటీవ‌ల నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్యల‌ను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబైర్‌నే. దీంతో ఆయన రెచ్చగొట్టే ట్వీట్స్ చేసిన‌ట్లు దిల్లీ పోలీసులు త‌మ ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు. ప్రజ‌ల్లో ద్వేష‌భావాన్ని పెంచేలా జుబైర్ ట్వీట్లు ఉన్నట్లు  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. .


Also Read: Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!


Also Read: Udaipur Murder Case: జైపుర్‌లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన 'ఉదయ్‌పుర్' హంతకులు

Published at: 30 Jun 2022 03:52 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.