Landslide Strikes Manipur: ఆర్మీ క్యాంప్‌పై విరిగిపడిన కొండచరియలు- ఏడుగురు మృతి, 45 మంది మిస్సింగ్!
Landslide Strikes Manipur: మణిపుర్‌లోని ఓ ఆర్మీ క్యాంప్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.
Continues below advertisement

(Image Source: ANI)
Landslide Strikes Manipur: మణిపుర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనే జిల్లాలోని తుపుల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆర్మీ క్యాంప్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ మేరకు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
Continues below advertisement
ఇప్పటివరకు 19 మందిని రక్షించాం. క్షతగాత్రులకు నోనే ఆర్మీ మెడికల్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశాం. - ఆర్మీ అధికారులు
45 మంది
ఈ ఘటనలో మొత్తం 45 మంది వరకు గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ఏడుగురు మృతదేహాలు లభ్యమయ్యాయని వెల్లడించారు.
సీఎం సమావేశం
ఈ ఘటనపై మణిపుర్ సీఎం బిరేన్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
గాలింపు, సహాయక చర్యల కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి బలగాలు. వైద్యులతో సహా అంబులెన్సులను ఘటనా స్థలికి చేరుకున్నాయి. - బిరేన్ సింగ్, మణిపుర్ సీఎం
Also Read: Udaipur Murder Case: జైపుర్‌లో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన 'ఉదయ్‌పుర్' హంతకులు
Also Read: MVA Crisis: శివసేన అధికారం కోసం పుట్టలేదు, అధికారమే శివసేన కోసం పుట్టింది: సంజయ్ రౌత్
Continues below advertisement