Shilpa And Raj Kundra Latest News: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో దృష్టి పెట్టిన ఈడీ రాజ్‌కుంద్రా ఇల్లు, ఆఫీస్‌, ఆయన సన్నిహితుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేస్తోంది. నటి శిల్పాశెట్టి భర్త అయిన రాజ్‌ కుంద్రా గతంలో పోర్నోగ్రఫీ కేసులో ఇరుక్కు్నారు. ఈ కేసు విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇల్లు, కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 


పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రా మాత్రమే కాకుండా చాలా మంది వ్యక్తుల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. మొబైల్ యాప్‌ల ద్వారా పోర్న్ కంటెంట్‌ని క్రియేట్ చేసి సర్క్యులేషన్ చేస్తున్నారన్న ఆరోపణలతో గతంలోనే రాజ్‌కుంద్రా అరెస్టు అయ్యారు. ముంబై పోలీసుల 2021 రిజిస్టర్ చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తోంది. 


మనీ లావాదేవీలపై ఆరా 
ఈ కేసులో మొత్తం 15 చోట్ల ఈడీ బృందం సోదాలు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేసులో దేశంలో వసూలు చేసిన డబ్బును విదేశాల్లో లావాదేవీలు జరిపారని అభియోగం ఉంది. పెద్ద మొత్తంలో నగదు ఒకచోటి నుంచి మరో చోటికి బదిలీ చేశారన్నఆరోపణలతో ఈడీ విచారణ ప్రారంభించింది.


Also Read: బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం


శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా ఇళ్లతోపాటు ఉత్తర్‌ప్రదేశ్, ముంబైలోని మొత్తం 15 చోట్ల ఈడీ దాడులు చేసింది. గత ఏప్రిల్‌లో ఇదే కేసుకు సంబంధించి 97 కోట్ల రూపాయల విలువైన రాజ్ కుంద్రా ఆస్తులను ED జప్తు చేసింది. ప్రస్తుతం మనీలాండరింగ్ నిరోధక చట్టం అంటే PMLA 2002 కింద విచారణ జరుగుతోంది. 


రాజ్ కుంద్రాను 2021లో అరెస్టు 
రాజ్‌కుంద్రాను క్రైమ్ బ్రాంచ్ జులై 2021లో అరెస్టు చేసింది.ఈ కేసులో సిటీ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రెండు నెలలు జైలులో కూడా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ రాజ్ కుంద్రా ఖండించారు. 


2018లో రాజ్ కుంద్రా బిట్‌ కాయిన్ స్కామ్‌ కేసులో ఇరుక్కున్నారు. 2000 కోట్ల రూపాయలు మోసం చేశారని ఆయపై కేసు నమోదై విచారణ సాగుతోంది. అప్పట్లోే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాజ్ కుంద్రాను ప్రశ్నించింది. 


Also Read: అమెరికాలో లంచాల కేసులు నమోదు కాలేదు - అదాని గ్రూపు కీలక ప్రకటన