Cricketer Imran Patel Died Cardiac Arrest: పూణెలో 35 ఏళ్ల ప్రొఫెషనల్ క్రికెటర్ ఇమ్రాన్ పటేల్ గుండెపోటుతో గ్రౌండ్‌లోనే కుప్పకూలిపోయాడు. బుధవారం లీగ్ మ్యాచ్ ఆడుతున్న పటేల్ తన ఎడమ చేయి, ఛాతీలో నొప్పి ఉందని అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. కొన్ని ఓవర్లు బ్యాటింగ్ చేశాడు. మళ్లీ వచ్చి ఇబ్బంది గురించి చెప్పాడు. అలా చెప్పి వెళ్తున్న క్రమంలోనే కుప్పకూలిపోయాడు.
అంపైర్‌తో మాట్లాడిన తర్వాత పటేల్ తిరిగి పెవిలియన్ వైపు నడిచాడు. అలా నడుస్తూనే పడిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ పటేల్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు.
ఇమ్రాన్ పటేల్ ఇప్పటి వరకు తీవ్రమైన ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోలేదని సహచర క్రికెటర్లు చెబుతున్నారు. ఫిజికల్‌గా కూడా ఫిట్‌గాన ఉంటాడని చెబుతున్నారు. మంచి ఆల్ రౌండర్ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నట్టు చెబుతున్నారు. క్రికెట్ ఆట అంటే చాలా ఇష్టమని పేర్కొంటున్నారు.
Also Read: సంచలనాలు సృష్టించినా సైడ్ చేశారు, ఐపీఎల్‌లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు
క్రికెట్‌ను ఎంతో ఇష్టపడి ఆడుతున్న పటేల్ ఇలా అకస్మాత్తుగా జరగడం అందర్నీ కలచి వేసింది. ఎందుకిలా జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదని స్నేహితులు వాపోతున్నారు. ఈ మ్యాచ్ లక్కీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, యంగ్ XI మధ్య జరిగింది. ఇందులో లక్కీ జట్టుకు పటేల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇన్నింగ్స్ ఆరవ ఓవర్‌లో 2 మంచి ఫోర్లు కొట్టాడు పటేల్.
ఇమ్రాన్ పటేల్‌కు ముగ్గురు కుమార్తెలు
ఇమ్రాన్ పటేల్‌కు ఇప్పటికే వివాహం అయింది. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని చిన్న కుమార్తె వయస్సు కేవలం 4 నెలలే. తన ఏరియాలో క్రికెటర్‌గా పటేల్‌కు మంచి పేరు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అతనికి సొంతంగా జ్యూస్ షాప్ ఉంది.
Also Read: ఐపీఎల్‌కు సెలక్ట్ అయిన సిక్కోలు కుర్రాడు, టాలెంట్ ఉంటే ఆసాధ్యం అనేదే ఉండదు