No bribery charges against Gautam Sagar Adani and other executives says Adani Group: అమెరికాలో నమోదైన కేసు విషయంలో మీడియాతో తప్పుడు ప్రచారం జరుగుతోందని అదాని గ్రూపు కీలక ప్రకటన చేసింది.  అమెరికాలో తనపై నమోదు అయింది  లంచం కేసులు కాదని స్పష్టం చేస్తూ అటు సెబీకి, ఇటు మీడియాకు లేఖలు పంపింది.  నమోదైన కేసులు లంచం కేసులు అని ప్రచారం జరుగుతోందని ఆ కేసులు కేవలం  ఫ్రాడ్ సెక్షన్లకు సంబంధించినవని అదాని గ్రూపు చెప్పింది.                                         


Also Read:  నిద్రపోయాడని ఉద్యోగం నుంచి తీసేశారు - కానీ కోర్టుకెళ్లి కంపెనీదే తప్పని నిరూపించాడు - వీడు మామూలోడు కాదు !


అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కూడా గౌతమ్ అదాని, సాగర్ అదానిలపై అమెరికా ఫారిన్ కరప్ట్  ప్రాక్టిసెస్ యాక్ట్ కింద కేసులు పెట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారని అయితే   చట్టం కింద కేసులు పెట్టలేదని ఆదాని గ్రూపు తెలిపింది. కేవలం మూడు ఆరోపణలు మాత్రమే చేశారని..   సెక్యూరిటీస్ ఫ్రాడ్ కన్‌స్పైరసి,  ప్రాడ్ కన్‌స్పైరసి, సెక్యూరిటీ ఫ్రాడ్ అనే మూడు ఆరోపణలు చేశారని తెలిపింది. ఇందులో లంచాల ప్రస్తావన లేదన్నారు.                     



అదాని  అమెరికా నుంచి పెట్టుబడులు అక్రమంగా సంపాదించడం కోసం అక్కడ మ్యానిప్యులేషన్ చేశారని అమెరికా కోర్టులో కేసు నమోదు అయింది. లంచాలు ఆయన అమెరికాలో ఇవ్వలేదు కాబట్టి అక్కడ కేసు అయ్యే అవకాశం లేదని.. పూర్తిగా అమెరికాలో  స్టాక్ ఎక్సేంజ్ కు సంబంధించిన కేసులోనే ఆయన పేరు ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఆయన రాజీ చేసుకోవడానికి అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.                                


Also Read:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?


ఏపీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో సెకీ తో విద్యుత్ ఒప్పందాలు జరిగాయి. ఈ సెకీకి అదానీ పవర్ సప్లయ్ చేస్తుంది. అంటే సెకీని మధ్యవర్తిగా ఉంచి అదానీ పవర్ పర్చేజింగ్ ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా అధిక రేటును కొనుగోలు చేసేందుకు లంచాలు ముట్టచెప్పారని అమెరికా కోర్టులో కేసు నమోదు అయింది. అమెరికా స్టాక్ మార్కెట్ లో రిజిస్టర్ అయిన ఓ కంపెనీ నుంచి నిధులు సేకరించారని.. అలా స్టాక్ మార్కెట్ ను మోసం చేసినందున ఎఫ్‌బీఐ విచారణ జరిపి కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అదాని గ్రూపు ఖండించింది.