Protests by Imran Khan supporters in Pakistan turn violent: పాకిస్తాన్‌లో మరోసారి అల్లర్లు చెలరేగుతున్నాయి. ఇస్లామాబాద్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ పార్టీకి చెందిన కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ పార్టీ అధ్యక్షుడు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన జైల్లో ఉన్నారు. ఆయనను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఇస్లామాబాద్‌ను ముట్టడిచేందుకు వారంతా వస్తున్నారు.
ఇస్లామాబాద్ వైపు దూసుకొస్తున్న భారీ కాన్వాయ్‌లను ఆపేందుకు పోలీసులు ఎక్కడికక్కడ చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఇండస్ట్రియల్ ఫ్యాన్స్ ను తీసుకొచ్చి అడ్డుకుంటున్నారు. పోలీసులు చేతులు ఎత్తేస్తూండటంతో ఆర్మీని రంగంలోకి దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్మీ కూడా వెంటనే రంగంలోకి దిగింది. పరిస్థితులు ఉతద్రిక్తంగా మారుతున్నాయని ప్రభుత్వానికి సమాచారం అందడంతో ఆర్మీకి కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు.
ఇస్లామాబాద్‌లోకి బలవంతంగా వచ్చేందుకు ప్రయత్నిస్తే కాల్చివేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఇలా ఆర్మీ ఓ చోట కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తువ ఉద్రిక్తత ఏర్పడింది. ఆరుగురు చనిపోయారు. ఇస్లామాబాద్ చుట్టుపక్క ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉండేవారు. అయితే ఆయనది సంకీర్ణ ప్రభుత్వం తర్వాత ఎంపీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం పడిపోయింది. తర్వాత నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించారు. కానీ ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు. అవినీతి కేసుల్లో జైల్లో పెట్టారు.
పార్టీ పేరు లేకపోయినా ఆయన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎన్నికల బరిలోకి దిగారు. ఇతర పార్టీల కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకున్నారు. షాబాద్ షరీపే ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇమ్రాన్ ను జైల్లో పెట్టిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఆయనను విడుదల చేయాలని తాజాగా ఫ్యాన్స్ ఉద్యమిస్తున్నారు. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ ను స్వాధీనం చేసుకుంటే.. ప్రస్తుత ప్రధాని షాబాద్ షరీఫ్ కూడా బంగ్లాదేశ్ ప్రధానిలా పారిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతల ఆందోళనలను అణిచివేసేందుకు ఆర్మీ కాల్పులు జరుపుతోంది. ఎంత మంది చనిపోతారో అంతకు డబుల్ ఉద్యమం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.