Man sues company that fired him for taking a nap at work: ఉద్యోగం చేస్తూ నిద్రపోతే యాజమాన్యానికి సహజంగానే కోపం వస్తుంది. ఆ ఉద్యోగిపై కోపం ఉంటే.. హెచ్ ఆర్ వాళ్లు ఇంకో రెండు, మూడు కలిపి టెర్మినేట్ చేయమని సూచనలు చేస్తారు. ఇలా ఓ రసాయన పరిశ్రమలో పని చేస్తున్న ఉద్యోగికి టెర్మినేషన్ లెటర్ వచ్చింది. దీనికి కారణం డ్యూటీ టైంలో గంట పాటు నిద్రపోయాడని సీసీ కెమెరాలో గుర్తించడమే. అతని దగ్గర వివరణ తీసుకుని రెండు వరాల తర్వాత ఉద్యోగం నుంచి తొలగించారు. తాను నిద్రపోవడానికి కంపెనీనే కారణం అని అతను కోర్టుకెళ్లాడు.తన వాదనే కరెక్ట్ అని నిరూపించి కంపెనీ దగ్గర పరిహారం పొందాడు.
ఇరవై ఏళ్ల సర్వీస్ అయినా డిస్మిస్
చైనాలోని చాంగ్ అనే ఉద్యోగి ఇరవై ఏళ్లుగా ఓ కెమికల్ కంపెనీలో పని చేస్తున్నారు. హార్డ్ వర్కర్ గా గుర్తింపు ఉంది. ఆయన ఓ రోజు ఇరవై గంట ల పాటు డ్యూటీ చేశారు. మళ్లీ వెంటనే తర్వాత రోజు డ్యూటీ కి వచ్చారు. ఆ సమయంలో ఆయన నిద్ర ఆపుకోలేక ఓ గంట సేపు నిద్రపోయాడు. సీసీ కెమెరాలు ఆ దృశ్యాలను పట్టేశాయి. హెచ్‌ఆర్ నోటీసులు జారీ చేసింది. ఆయన అందులో వివరణ కూడా..అందకు ముందు రోజు ఇరవై గంటల పాటు పని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కంపెనీకి మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నందున తాను ఇరవై గంటల పాటు పని చేయాల్సి వచ్చిందని అందుకే నిద్ర వచ్చిందని ఆయన చెప్పారు. ఆయన వివరణ తీసుకున్న రెండు వారాల తర్వాత డిస్మిస్ చేస్తూ కంపెనీ ఉత్తర్వులు ఇచ్చింది.
కంపెనీతో ఒప్పందం ప్రకారం తొలగింపు
ఉద్యోగంలో చేరేటప్పుడు ఇచ్చిన ఒప్పందం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకున్నామని దీన్ని కాదనలేని కంపెనీ స్పష్టం చేసింది. ఇది ఉద్యోగ నిబంధనల మేరకు జరిగిందని స్పష్టం చేసింది. అయితే చాంగ్ మాత్రం దీన్ని ఒప్పుకోలేదు. ఇరవై గంటలు పని చేయాలని ఒప్పందంలో చెప్పలేదని..అయినా చేయించుకున్నారని దానికి నిద్ర వస్తే.. ఉద్యోగం నుంచి తీసేస్తారా అని ప్రశ్నించారు. కానీ కంపెనీ ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లారు.
Also Read: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
కంపెనీదే తప్పని చెప్పిన కోర్టు
కోర్టు ముందు కూడా తన వాదనలను ఉద్యోగి చాంగ్ గట్టిగా వినిపించారు. కంపెనీ కోసంతాను పని చేస్తే.. తన ఉద్యోగం తీసేశారని తెలిపారు. చాంగ్ వాదనలతో లేబర్ కోర్టు కూడా ఏకీభవించింది. కంపెనీ తప్పు చేసిందని చెప్పి రూ. 40లక్షల పరిహారాన్న ఇవ్వాలని ఆదేశించింది. మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ కంపెనీ చెప్పినా ఉద్యోగి చాంగ్ మాత్రం.. అంత అవమానించిన కంపెనీ దగ్గర తాను పని చేయబోనని చెప్పి .. పరిహారం తీసుకుని వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.