Putin orders Satan II to be ready to deploy for nuclear war: ఉక్రెయిన్ - రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం .. మూడో ప్రపంచయుద్ధానికి దారి తీస్తోంది. ఉక్రెయిన్‌కు రష్యా, బ్రిటన్ పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తూండటం..రష్యాపై దాడి చేసేందుకు అనుమతి ఇస్తూండటంతో పుతిన్ రగిలిపోతున్నారు.తమపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చే దేశాలు కూడా తమ శత్రువులేనని వారిపై అణుదాడి చేయడానికి తమ దేశానికి అన్ని హక్కులు ఉన్నాయని ఇటీవలే తీర్మానం చేశారు. అయినా బ్రిటన్, అమెరికా అదే పనిగా ఉక్రెయిన్‌కు సహకరిస్తున్నాయి. దీంతో పుతిన్ తన అణు బాంబు సన్నాహాలు ప్రారంభించారు. 


బ్రిటన్ వైపు సతాన్ 2 అణుబాంబు గురి !


కొద్ది రోజులుగా న్యూక్లియర్ బాంబులు అమెరికా, బ్రిటన్ లపై వేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు పుతిన్. తాజాగా ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. తమ న్యూక్లియర్ వార్ హెడ్ సతాన్ 2ను రెడీ చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. వ్యూహాత్మకంగా బ్రిటన్  పై దాడి చేసేందుకు అనుకూలమైన ప్రాంతానికి తరలించాలని సూచించారు. ఇప్పుడు సైన్యం ఆ పనిలో ఉంది. పుతిన్ తమ దేశం పై దాడికి వచ్చే దేశాల విషయంలో ఏ మాత్రం క్షమించేది లేదని.. తమకు తమ దేశం ముఖ్యమని ప్రపంచం ఏమైనాపోయినా పర్వాలేదని ఆయన అభిప్రాయం. 


Also Read:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !


సతాన్ 2 బాంబు పేలిస్తే బ్రిటన్ సర్వనాశనం


రష్యా బ్రిటన్ వైపు మోహరిస్తున్న సతాన్ 2 క్షిపణి అత్యంత ప్రమాదకరమైనది.  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణి. దీనికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది. ఈ అణు క్షిపణి బరువు 208.1 టన్నులు. ఇది 10 టన్నుల వరకు పేలోడ్‌ను మోయగలదు. దీని స్ట్రైక్ రేంజ్ 35 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది.  దీనిని రష్యా విజయవంతంగా పరీక్షించిన తర్వాత, 2023లో దీనిని సైన్యంలో చేర్చింది. ఈ ఒక్క  బాంబు పేలిస్తే.. యూకే సర్వనాశనం అయిపోతుందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. 


Also Read:  పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ తరహా అల్లర్లు - రెచ్చిపోతున్న ఇమ్రాన్ సపోర్టర్లు - అధ్యక్షుడు పారిపోవాల్సిందేనా ?


పుతిన్‌ను పదే పదే ఎందుకు రెచ్చగొడుతున్నారు ?


నాటో దేశాలు అటు పూర్తిగా ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండటం లేదు. అప్పుడు కొన్ని.. అప్పుడు కొన్ని ఆయుధాలు ఇచ్చి రష్యాపై దాడి చేయమని చెబుతున్నాయి. నేరుగా ఉక్రెయిన్ తరపున రంగంలోకి దిగి రష్యాను ఓడిస్తే సమస్య ఉండదు.కానీ ఆయా దేశాలు ఉక్రెయిన్ ను ముందు పెట్టి రష్యాను మరింత రెచ్చగొడుతున్నాయి.ప్రపంచాన్ని మూడో వరల్డ్ వార్ వైపు తీసుకెళ్తున్నాయి. పుతిన్ ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో ఎవరూ కల్పించుకోవద్దని మొదటి నుంచి హెచ్చరిస్తున్నారు. అసలు ఉక్రెయిన్ ను మొదటి నుంచి రెచ్చొట్టి.. రష్యా దాడులు చేసేలా చేసింది కూడా నాటో దేశాలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలో ఒక్క అణుబాంబు పడినా అది మామూలు విద్వంసం అవదు. అలా జరిగితే అది పుతిన్ కన్నా.. నాటో దేశాల తప్పే ఎక్కువ అవుతుంది.