ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh   మన దేశంలో మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ హిందువులు. కానీ బంగ్లాదేశ్ లో హిందువులు మైనార్టీలు. అక్కడ ఇప్పుడు హిందువులు తలెత్తుకు తిరిగే పరిస్థితులు లేవు. కనీసం బతకగలిగే సిచ్యుయేషన్ కూడా కనిపించటం లేదు. నిన్న మొన్నటి వరకూ షేక్ హసీనా రూలింగ్ పై తిరగబడిన బంగ్లా దేశ్ ప్రజలు ప్రత్యేకించి అక్కడి ముస్లిం జనాభా..ఇప్పుడు అక్కడ హిందువులపై దాడులు, తిరుగుబాట్లు నానా విధ్వంసం చేస్తున్నారు. ప్రధానంగా అక్కడి హిందువులపై దాడికి కారణంగా కనిపిస్తోంది భారత్ అంటే అక్కడి ప్రజల్లో పెరిగిపోతున్న విద్వేషం. హిందువులంతా భారత్ కు చెందిన వారే కాబట్టి వారిని సాధిస్తే అది భారత్ పై పగ తీర్చుకోవటం లాంటిదే అన్న భావన బంగ్లాదేశ్ లో రోజు రోజుకు పెరిగిపోతోంది. విపరీతమైన హింస. కేవలం హిందువులనే కాదు అతి కొద్ది సంఖ్యలో ఉండే బౌద్ధులు, జైనులపైనా కూడా దాడులు పెరిగిపోతున్నాయి. బంగ్లా దేశ్ లో హిందువులపై దారుణాలు తీవ్రస్థాయిలో పెరిగిపోతున్నాయని చెప్పటానికి నిదర్శనం ఇస్కాన్ మాంక్ చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభు అరెస్ట్. 


పోలీసు వాహనంలో వెళుతూ విక్టరీ సింబల్ చూపిస్తున్న ఈయనే చిన్నయ్ కృష్ణ దాస్. ఇస్కాన్ అని కృష్ణతత్వాన్ని ప్రభోదించే భక్తి శాఖ. ప్రపంచమంతా ఇస్కాన్ టెంపుల్స్ విస్తరించి ఉంటాయి. మనకు కూడా తెలుసు చాలా ఊళ్లలో శ్రీకృష్ణుడి గురించి వీళ్లు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఓ ధార్మిక సంస్థకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేయటం అది కూడా ఏంటీ దేశద్రోహం కేసులో అరెస్ట్ చేయటమే భారత్ సహా అనేక దేశాల ఆగ్రహానికి ఇప్పుడు కారణమైంది. కారణాలను బంగ్లా దేశ్ కచ్చితంగా వెల్లడించలేదు కానీ ఓ ర్యాలీ లో కృష్ణదాస్ బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారు అనేది ఆయన పై మోపిన ఆరోపణ. ఆయనతో మరో పద్దెనిమిది మంది మీద దేశద్రోహం కేసు పెట్టి ఈ నెల 26న ఢాకా ఎయిర్ పోర్ట్ లో కృష్ణదాస్ ప్రభును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కృష్ణదాస్ అరెస్ట్ తో బంగ్లాదేశ్ లో మైనార్టీలు రోడ్లపైకి వచ్చారు. తమపై జరుగుతున్న దాడులను తిప్పికొడుతూనే మతపరంగా తమపైన చూపిస్తున్న వివక్షను బహిరంగంగానే ఎండగట్టారు. ఈ ఘర్షణల్లో సైఫుల్ ఇస్లాం అనే న్యాయవాది చనిపోవటం ఈ గొడవ ఇంకా పెద్దది అవటానికి కారణమైంది. 


అసలు ఎవరి చిన్నయ కృష్ణదాస్ ప్రభు అంటే ఈయన ఇస్కాన్ కి చెందిన ఓ సన్యాసి. దీంతో పాటు అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులు ఆపాలంటూ ఏర్పాటైన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతనీ జాగరణ్ జోట్ కు ఈయన అధికార ప్రతినిధి గా కూడా ఉన్నారు. అక్టోబర్ 25న చివరి సారిగా ఏర్పాటైన ఓ ర్యాలీ కృష్ణదాస్ హిందువుల హక్కుపై గట్టిగా గళం విప్పారు. అక్కడ కొత్తగా ఏర్పాటైన మహ్మద్ యూనుస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైందని అందుకే ఆయన్ను అకారణంగా రాజకీయాల్లోకి లాగి అరెస్ట్ చేశారనేది ఇస్కాన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. కృష్ణదాస్ అరెస్ట్ ఖండిస్తూ ఇస్కాన్ ఈ లేఖను విడుదల చేసింది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఎప్పటి నుంచో ఖండిస్తున్న మన కేంద్ర ప్రభుత్వం దీనిపై మాట్లాడింది. మతాన్ని, ఆధ్యాత్మిక గురువులను అరెస్ట్ చేసి బంగ్లాదేశ్ చాలా తప్పు చేసిందని...ఘాటుగానే మాట్లాడింది కేంద్ర ప్రభుత్వం. ఓ లేఖను కూడా విడుదల చేసింది. 


బంగ్లాదేశ్ లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత రోడ్ల బాట పడుతున్నారు. చాలా మంది వేరే దేశాలకు పనులు కోసం వెళ్లిపోతున్నారు. కానీ అక్కడి ప్రభుత్వం ఈ అస్థిర పరిస్థితుల నుంచి తప్పించుకోవటానికి ఆ నెపాన్ని అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై కి నెట్టేస్తోంది. తమ దేశంలో ఈ పరిస్థితులకు కారణం భారతేనని...అప్పట్లో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా భారత్ చెప్పుచేతల్లో పనిచేస్తున్నారని యువతను రెచ్చగొట్టాయి భారత్ వ్యతిరేక శక్తులు. దీంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ కు వచ్చి తలదాచుకున్నారు. ఆమెను తిరిగి అప్పగించాలనేది బంగ్లాదేశ్ డిమాండ్. హసీనా తర్వాత అక్కడి పరిస్థితులను చక్కదిద్దుతానంటూ మహ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మైక్రో ఫైనాన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా  గ్రామీణ బ్యాంకులను 2006లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు మహ్మద్ యూనుస్. అలాంటి వ్యక్తి చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్తోందంటే పరిస్థితులు చక్కబడతాయని అంతా ఎక్సెప్ట్ చేశారు. కానీ బంగ్లాదేశ్ లో పాకిస్థాన్ ప్రోత్సాహిత విచ్ఛిన్న శక్తులు అక్కడి యువతను పెడతోవ పట్టిస్తున్నాయి. తమ దేశంపై పెత్తనం చెలాయిస్తున్న భారత్ నుంచి తమకు ముక్తి కావాలంటే పాకిస్థాన్ ప్రోత్సాహం ఉండాలని..ఎందుకంటే పాకిస్థాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి భారత్ చడీ చప్పుడు లేకుండా ఉంటుందని అక్కడి యువతను రెచ్చగొడుతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నారు. 


 





 


సార్వత్రిక ఎన్నికలకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి మొదలుపెడితే ప్రధాని మోదీ, నిన్న ఢిల్లీ పర్యటనలో పవన్ కళ్యాణ్ వరకూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నారు. అంతెందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ బంగ్లాదేశ్ పై హిందువులపై జరుగుతున్న దాడులు ప్రభావం చూపించాయి. తనకు హిందువులంటే చాలా ఇష్టమని వాళ్లపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాన్నారు డొనాల్డ్ ట్రంప్..ఆయన గెలిచారు కూడా. మరి దీనిపై ప్రపంచదేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయి. బంగ్లాదేశ్ ముస్లిం రాజ్యంగా తమను తాము ప్రకటించాలనుకుంటోందా. అందుకోసం 91శాతం ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి 7శాతం కూడా లేని హిందువులపై దాడులు చేయిస్తోందా..ఇస్కాన్ నిషేధించాలని బంగ్లాదేశ్ హైకోర్టులో దాఖలైన పిటీషన్లు, తమ రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తొలగించాలని ఆ దేశ అటార్నీ జనరల్ ఉన్నత న్యాయస్థానంలో కోరటం వరకూ బంగ్లాదేశ్ వేస్తున్న ప్రతీ అడుగు అక్కడున్న హిందువులకు మాత్రం నరకం చూపిస్తోంది.