ఈ ఏండా కాలం  ( Summer ) మంటల మీద కూర్చున్నట్లుగానే ఉంది. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో  వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఈ వాతావరణ పరిస్థితి వర్షాకాలంపై ( Rainy Season ) ఎలాంటి ప్రభావం చూపదని భారత వాతావరణ సంస్థ ( IMD ) ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు ( southwest monsoon )  ఎప్పట్లాగే భారత్‌కు వస్తాయని ఆలస్యం జరగదని ఐఎండీ తెలిపింది. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయి. తొలకరి ప్రారంభమవుతుంది. 


నీళ్లు దొరకకపోతే అది తాగడానికి రెడీగా ఉన్నాం: రోప్‌వే భయానక ఘటనపై ఓ వ్యక్తి


వచ్చే వర్షాకాలంలో వర్ష పాతం కూడా సాధారణంగానే ఉంటుందని ఐఎండీ తెలిపింది. 96 శాతం వర్షపాతం ( Rain Fall ) నమోదవుతుందని అంచనా వేసింది. అత్యధికంగా 104 శాతం వరకూ ఉండవచ్చని తెలిపింది. లాంగ్ పీరియడ్ యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇది సాధారణం కన్నా ఎక్కువే. ఉత్తర  భారతంలో సాధారణం , సాధారణం కంటే ఎక్కువ వర్ష పాతం ( normal rainfall ) పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సారి కొన్ని దక్షిణాది ప్రాంతాల్లోనూ తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 





మార్చాల్సింది రాజ్యాంగాన్నా ? మారాల్సింది రాజకీయ వ్యవస్థనా ?


దేశంలో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు ( Heatwave ) నమోదవుతున్నాయి. ఢిల్లీలో తెల్లవారు జామున కూడా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఇది సాధారణం కంటే ఎక్కువే. వేడి గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ ( Weather Office )అధికారులు చెబుతున్నారు. దేశంలో పలు ప్రాంతాల్లో నలభై డిగ్రిల సెల్సియస్ ఉద్యోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాల క్రియాశీలత చాలా ముఖ్యం. మంచి వర్షపాతం నమోదయితే పంటలు బాగా పండుతాయి. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. దేశంలో అరవై శాతం  పొలాల్లో సాగు వర్షాధారంగానే ఉంది. 


ఇటీవలి సంవత్సరాల్లో ఉష్ణోగ్రతలు ఎండా కాలంలో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అదే సమయంలో  వర్షాకాలం కూడా నిరాసపరచడం లేదు. కానీ అప్పుడప్పుడూ నైరుతి రుతుపువనాల రాక మాత్రం ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సారి అలాంటి సమస్య లేదని ఐఎండీ చెప్పడంతో ప్రజలకు రిలీఫ్ లభించినట్లయింది.