Urinated in bottle to drink in case we did not get water: ఝార్ఖండ్‌లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదం నుంచి సురక్షితంగా బటయపడిన ఓ వ్యక్తి తాను ఎదుర్కొన్న భయానక పరిస్థితులను వివరించాడు. మరికొంత సమయం వరకు నీళ్లు దొరకకపోతే యూరిన్ తాగేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని, అందుకోసం బాటిల్‌లో యూరిన్ పోసి సిద్ధంగా ఉంచామని వినయ్ కుమార్ దాస్ అనే వ్యక్తి తమకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. అతడితో పాటు మొత్తం ఆరుగురు కుటుంబసభ్యులు, మరికొందరు దియోఘర్ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద రోప్ వే ప్రమాదంలో చిక్కుకున్నారు. 


రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. 
దాదాపు 45 గంటలపాటు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. సోమవారం సాయంత్రం వరకు సుమారు 25 మందిని రక్షించారు. దియోఘర్‌ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న మరో 15 మందిని ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్ మంగళవారం నాడు రక్షించింది. ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్లను ఉపయోగించి రోప్ వే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడారు. అయితే బాధితులు మాత్రం ఆ క్షణాలను తలుచుకుంటేనే వణికిపోతున్నారు. రోప్ తెగిపోవడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.


ప్రాణం లేచి వచ్చినట్లుంది.. 
బిహార్ లోని మధుబని జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రోప్ వే ఘటన నుంచి సురక్షితంగా బయటపడి తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించాడు. మేం ప్రాణాలు కోల్పోతామని భావించాం, కానీ ఎంతో శ్రమించి రెస్క్యూ టీమ్ మమ్మల్ని కాపాడింది. ఓ చిన్నారి మాట్లాడుతూ.. రోప్ ద్వారా మమ్మల్ని అలా లాగుతుంటే తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పింది. మరో బాలిక మాత్రం తాను చాలా భయపడ్డానని, కానీ రాత్రంతా అక్కడే చికట్లో ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు నీళ్లు తాగామని, ప్రాణం లేచివచ్చినట్లు అనిపించిందని బాధితులు ఒక్కొక్కరు తమ అనుభవాలను పంచుకున్నారు.


ఎల్లో టీషర్ట్, షార్ట్ ధరించిన వ్యక్తి వినయ్ కుమార్


అసలేం జరిగిందంటే.. 
ఆదివారం సాయంత్రం దియోఘర్‌ జిల్లా త్రికూట్ పర్వతాల వద్ద ఉన్న రోప్‌వేలోని కేబుల్ కార్లు ఒకదాన్ని మరొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 42 మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు భారత సైన్యం, వాయుసేన, ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 


రోప్‌వే కార్ కేబిన్లలో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు రెండు ఎమ్ఐ-17 హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌కు చెందిన ఓ వ్యక్తిని భారత వైమానిక దళం హెలికాప్టర్‌లోకి లాగేందుకు ప్రయత్నించింది. ఆ క్షణంలో ఏమైందో ఏమో.. హెలికాప్టర్ వరకు చేరుకున్న తర్వాత తాడుకు వేలాడుతూ కనిపించిన మహిళ తాడు తెగిపోవడంతో లోయలో పడిపోయి చనిపోయారు.  






Also Read: Jharkhand: వీడియో - హెలికాప్టర్‌పై నుంచి పడిపోయిన బాధితుడు, జార్ఖండ్ రోప్‌వే రెస్క్యూలో అపశృతి


Also Read: Jharkhand Ropeway Accident: రోప్‌వేలో కేబుల్ కార్లు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి- చిక్కుకుపోయిన 42 మంది