ఢిల్లీ విమానాశ్రయ అధికారులు.. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి భారత్‌కు డ్రగ్స్ తరలిస్తున్న ఓ మహిళను పోలీసులు.. అరెస్టు చేశారు. మహిళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు.. 72 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
దుబాయ్ మీదుగా ఆ మహిళ.. భారత్‌కు వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె అనుమానాస్పదంగా తిరుగుతుంది. అయితే ఆమెపై అనుమానం వచ్చి.. టెర్మినల్ 3 వద్ద కస్టమ్స్ అధికారులు పరిశీలించారు. మహిళకు చెందిన లగేజీని పరిశీలించారు. రెండు లెదర్ ఫోల్డర్లను స్వాధీనం చేసుకున్నారు.. అవి అధికంగా బరువుతో ఉన్నాయి. అనుమానంతో వాటిని కత్తిరించి.. తనిఖీ చేశారు అధికారులు. ఆ తర్వాత వాటిని చూసి షాక్ అయ్యారు. అందులో డ్రగ్స్ ఉన్నట్టు గుర్తించారు. స్క్రీనింగ్ సమయంలో నిఘా వారికి చిక్కకుండా కార్బన్, బ్లాక్ టేప్ లతో డ్రగ్స్ ను మహిళ కనిపించకుండా.. చుట్టి పెట్టింది. పాలీ బ్యాగుల్లో డ్రగ్స్ ను తీసుకొస్తుంది.
మహిళ తీసుకొచ్చిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
భారత్-పాక్ సరిహద్దులో..
ఇటీవలే పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నాయి. వాటి విలువ రూ. 55 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 11 ప్యాకెట్ల హెరాయిన్‌ను బర్రెక్ సరిహద్దు అవుట్ పోస్టు వద్ద గుర్తించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి.
Also Read: Jammalamadaka Pichaiah: తొలితరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కన్నుమూత...
Also Read: Crime News: నాటువైద్యం చేయిస్తానని తీసుకెళ్లి బాలికతో వ్యభిచారం.. తప్పించుకుని రాగా మరో ముఠా కూడా..
Also Read: PM Kisan Yojana: కొత్త సంవత్సరం కానుక! జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు వేయనున్న మోదీ