గుంటూరు జిల్లా పేరేచర్ల గ్రామంలో ఈనెల 22వ తేదీన ఒక వైన్ షాప్ లో ఇద్దరు వ్యక్తులు మూడు రూ.200 నోట్లు ఇచ్చి మద్యం కొనుగోలు చేశారు. అయితే ఆ మూడు నోట్లు నకిలీ కావడంతో వైన్ షాప్ గుమస్తా మేడికొండూరు పోలీస్ స్టేషన్ లో ఈ నెల 26న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పేరేచర్ల గ్రామంలో జెట్టి కిషోర్, పంతగాని పూర్ణచంద్రరావు, దేవళ్ళ శ్రీనివాస్ లను అదుపులోకి తీసుకొని విచారించారు. గుంజి అంకమరాజు అనే కమిషన్ ఏజెంట్ ద్వారా జెట్టి కిషోర్, పంతగాని పూర్ణచందర్రావు, దేవళ్ళ శ్రీనివాస్, దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన వెంకట నారాయణరెడ్డి, షేక్ జానీ భాష, జంగం శ్రీనివాసరావు  ఒక అసలు నోటుకు నాలుగు నకిలీ నోట్లు ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న వీరిని పోలీసులకు అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. నిందితులలో జంగం శ్రీనివాసరావు నకిలీ నోట్లను తయారు చేయడంలో దిట్ట అని గతంలో ఇతనిపై కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి నకిలీ కరెన్సీతో బాటు, వాటి తయారీకీ ఉపయోగించే స్కానర్, ప్రింటర్, జిరాక్స్ మిషన్ రెండు కార్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వెల్లడించారు.


Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ



45 లక్షల దొంగ నోట్లు స్వాధీనం


'నకిలీ కరెన్సీ తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశాం. ఇద్దరు పాత నేరస్తులతో పాటు ఏడుగురిని అరెస్టు చేశాం. నకిలీ నోట్లు మారుస్తున్న వారితో పాటు తయారు చేస్తున్న వారిని అరెస్టు చేశాం. రెండు వందల, ఐదు వందల నోట్లు తయారుచేస్తున్నట్లు గుర్తించాం. తయారీకి ఉపయోగించిన పరికరాలు, నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం. వైన్ షాపులో నకిలీ కరెన్సీ వచ్చినట్లు మేడికొండూరు స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు. నిందితుల్లో గతంలో దొంగ నోట్ల తయారు కేసులో నిందితుడిగా ఉన్న జంగం శ్రీనివాస్ ఉన్నాడు. పేకాట, మద్యం కొనుగోలు చేయటానికి నకిలీ కరెన్సీ ఉపయోగించారు. నెల రోజులుగా నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు.' అని గుంటూరు అర్బన్ ఎస్పీ అరిఫ్ హఫీజ్ తెలిపారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న 7గురు సభ్యుల గల ముఠాను అరెస్ట్ చేసిన మేడికొండూరు పోలీసులు. వారి వద్ద నుండి 45 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ, ముద్రణ సామగ్రి, రెండు స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ వెల్లడి. ప్రతిభ చూపిన పలువురు అధికారులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు పలికారు. 


Also Read: సీఆర్పీఎఫ్ జవాన్ల మధ్య కాల్పులు... ఎస్సైపై కాల్పులు జరిపిన కానిస్టేబుల్... ఎస్సై మృతి, కానిస్టేబుల్ కు తీవ్రగాయాలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి