ములుగు జిల్లా నూగురువెంకటాపురం పోలీసు స్టేషన్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ ఎస్సై ఉమేష్ చంద్ర, కానిస్టేబుల్ స్టీఫెన్ లు మెస్ వద్ద గొడవ పడి కాల్పులు జరుపుకోవడంతో ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్ర మృతి చెందారు. కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ఆ తర్వాత తనని తాను కాల్చుకోగా కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కానిస్టేబుల్ ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు అంటున్నారు.
Also Read: ఈ ఛానెళ్లలో పని చేసేవాళ్లు జర్నలిస్టులే కాదు.. అల్లం నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఎస్సై మృతి, కానిస్టేబుల్ పరిస్థితి విషయం
ములుగు జిల్లాలో 39వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ కు సంబంధించి ఓ సమావేశం జరిగింది. ఈ బెటాలియన్ లోని స్టీఫెన్, ఎస్సై ర్యాంకు అధికారి ఉమేష్ చంద్ర అనే జవాన్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెండు రౌండ్ల కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఎస్సై ఉమేష్ చంద్ర అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కానిస్టేబుల్ స్టీఫెన్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. స్టీఫెన్ ను ఏటూరు నాగారం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఉమేష్ చంద్ర సొంతూరు బీహార్. స్టీఫెన్ కన్యాకుమారికి చెందిన వాడని సమాచారం. విధి నిర్వహణలో భేదాభిప్రాయాలతో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ విచక్షణ కోల్పోయి ఎసైపై కాల్పులు జరిపి, తాను కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటన ములుగు జిల్లా అడవి వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
Also Read: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌కే కుచ్చుటోపీ!
ఈ ఘటనపై ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు వెంకటాపురం పోలీస్ స్టేషన్ లో సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ కి చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ సీఆర్పిఎఫ్ కు చెందిన ఎస్సై ఉమేష్ చంద్రపై కాల్పులు జరిపారని, అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఎస్సై ఉమేష్ చంద్ర మృతిచెందగా హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేసి పూర్తి వివరాలు తెలుపుతామని ఎస్పీ అన్నారు. పని ఒత్తిడి వల్ల ఏర్పడిన మనస్పర్థలతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల నక్సల్స్ కోసం అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సోదాలు, బందోబస్తు నిర్వహించే క్రమంలో పనిభారం పెరిగి, మనస్పర్థలు వచ్చుంటాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...