Allam Narayana Comments On Teenmar Mallanna: యూట్యూబ్‌లో పనిచేసేవాళ్లంతా జర్నలిస్టులు కారని తెలంగాణ ప్రెస్ అకాడెమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. అలాంటి వారికి ఏ గుర్తింపు ప్రాతిపదిక ఏదీ లేదు అన్నారు. యూట్యూబ్ రిపోర్టర్లను ప్రోత్సహించవద్దని, వాళ్లు జర్నలిస్టులు కాదు అని స్పష్టం చేశారు. అసలు రాజ్యాంగంలో ప్రత్యేక మైన స్వేచ్ఛ అంటూ లేదు. భావ ప్రకటన పేరుతో కంట్లో పొడుస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు.
యూట్యూబ్ చానల్స్ వాళ్ళ వల్ల మీడియా విశ్వసనీయతకే ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన జర్నలిస్టులు తమ ఉనికిని చాటుకో లేకపోతున్నారు, వాస్తవాలను వెలికి తీయడం లేకపోతున్నారు. యూట్యూబ్ రిపోర్టర్లు, పీడీఎఫ్ పేపర్స్ రిపోర్టర్లు ఎట్టి పరిస్థితిలో జర్నలిస్టులు కారు అని, వారికి ఎలాంటి క్రెడిబిలిటి లేదని, అలాంటి వారిని ప్రోత్సహించవద్దు అని అల్లం నారాయణ కోరారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్‌లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుపై పోల్ పేరిట చేసిన బాడీ షేమింగ్ హేయమైన చర్య అన్నారు.
కుటుంబసభ్యులపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం జర్నలిజం కాదని హితవు పలికారు. యూట్యూబ్ చానల్ పేరిట ఏం మాట్లాడుతున్నారు, ఏం చూపిస్తున్నారు అనేది కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. యూట్యూబ్ ఛానెళ్లలో వాడే భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటుందని అసహనం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా రాజకీయ నాయకులు, సినీ, ఇతర రంగాల సెలబ్రిటీలపై ఉన్న అక్కసును వారి కుటుంబసభ్యులపై సైతం వెల్లగక్కుతున్నారని అల్లం నారాయణ మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోండి..
మంత్రి కేటీఆర్ కుమారుడి మీద బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం బంజారాహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ లో కేటీఆర్ తనయుడు హిమాన్షుపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసి అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నేతలపై ఉన్న ఆగ్రహాన్ని వారి కుటుంబసభ్యులపై చూపిస్తూ, తీన్మార్ మల్లన్న ఇష్ట రీతిన పోస్టులు చేస్తున్నారని పోలీసులకు వివరించారు. తీన్మార్ మల్లన్న చేసే వాఖ్యలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం తలెత్తే అవకాశాలున్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Also Read: Attack on Teenmar Mallanna: బూతులు తిడుతూ తీన్మార్ మల్లన్నపై దాడి.. ఏకంగా ఆఫీసులోకి దూసుకొచ్చి దుండగులు రచ్చ రచ్చ.. కేటీఆర్ పనేనని ఆరోపణలు
Also Read: Money Tips Telugu: కొత్త ఏడాదిలో ధనవంతులవ్వాలని ఆశపడుతున్నారా? ఇంట్లో ఈ వస్తువులు ఉండేలా చూసుకోండి...
Also Read: Hyderabad: పాత పనిమనిషి మెగా ప్లాన్.. దాన్ని అమలు చేసిన కొత్త పనిమనిషి, ఓనర్‌కే కుచ్చుటోపీ!