కరోనా వేళ దేశమంతా ఏకతాటిపై నిలిచిందని, ఓమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ కేసులు తీవ్రం అవుతున్న వేళ అంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి హెచ్చరించారు. ఆదివారం ఉదయం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో కీలక విషయాలను ప్రస్తావించారు. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా ఆ దుర్ఘటనలో చనిపోయిన వారిని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టబోతోన్నామని అన్నారు. ఈ సందర్భంగా ఏడేళ్లుగా ప్రతి నెలా నిర్వహిస్తూ వస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఏడాది ఇదే చివరిది అని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 


మన్ కీ బాత్‌లోని ముఖ్యాంశాలు
* ‘‘మన్ కీ బాత్ అనేది ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనుల గురించి ప్రచారం చేసుకోవడానికి కాదు. అది ఎలాగైనా ప్రచారం చేసుకోవచ్చు. కానీ, ఇది గ్రామీణ స్థాయిలోనూ సామాజిక మార్పునకు కృషి చేయడం కోసం ఉద్దేశించినది’’


* స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్ల వినియోగం గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ‘‘ఎప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ స్ర్కీన్లను చూడడంపై సమయం అధికంగా వెచ్చిస్తున్నామో.. అదే సమయంలో పుస్తకాలు చదవడానికి కూడా సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది మీరు ఏ పుస్తకాలు చదివారో అందరికీ షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఇతరులు 2022లో ఏ పుస్తకాలు చదవాలో తెలుసుకుంటారు.’’


* భారత సంస్కృతి, సంప్రదాయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఉత్సుకత పెరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన వారు మన కల్చర్ గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అంతేకాకుండా మన సాంప్రదాయాలను వారు మరింతగా ప్రోత్సహిస్తున్నారు.


* SAAF-Water అనేది ఓ స్టార్టప్. ఇది స్వచ్చమైన తాగునీటిని జనం మ్యాపుల్లో సులభంగా కనుగొనేందుకు సాయపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో పని చేసే ఈ టెక్నాలజీ.. ప్రజలు సులభంగా స్వచ్ఛమైన తాగునీటిని గుర్తించేందుకు వీలు పడుతుంది.


* “ఈ నెల 26న మన్ కీ బాత్ కోసం నాకు అనేక ఇన్‌పుట్‌లు అందుతున్నాయి, ఇది 2021లో చివరిది. ఈ ఇన్‌పుట్‌లు చాలా విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పనిచేస్తూ సామాజిక మార్పునకు కృషి చేస్తున్న అనేక మంది లైఫ్ జర్నీకి సంబంధించినవి కూడా ఉన్నాయి.. ఇట్లాంటి ఎన్నో అభిప్రాయాలను తరుచుగా నాకు షేర్ చేస్తూ ఉండండి” అని ప్రధాని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.


Also Read: నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగం విజయవంతం... విశ్వం గుట్టు ఛేదించేందుకు నింగిలోకి దూసుకెళ్లిన టెలిస్కోప్


* ప్రతి సంవత్సరం మాదిరిగానే వచ్చే ఏడాది ప్రారంభంలో పరీక్షా పే చర్చను నిర్వహిస్తాం. మనం మళ్లీ ప్రత్యేక బంధాన్ని ఏర్పరుచుకుందాం. ఎటువంటి కష్టతరమైన పరీక్షలను అయినా ఎదుర్కొని విజయాలతో సెలబ్రేట్ చేసుకుందాం.


* ఈ సంక్లిష్ట సమయంలో మీరు తప్పనిసరిగా 2021కి వీడ్కోలు పలికి, 2022కి స్వాగతం పలికేందుకు రెడీ అవుతూ ఉంటారు. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, రాబోయే సంవత్సరంలో మెరుగ్గా ఉండేందుకు.. మరింత మెరుగైన పని చేయాలన్న సంకల్పం తీసుకుంటారు.


* కనీసం వార్తా పత్రికలు చదివేందుకు వీలు లేని వారికి ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న పథకాలు, జరుగుతున్న మార్పులను సులభంగా చేరగలిగేలా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీంతో ఇది అట్టడుగు స్థాయిలో ఎంతో మందిని ఆలోచింపజేసేలా మారింది. వారిలో చాలావరకూ మార్పు తీసుకొచ్చింది. ఇప్పుడు చాలామంది దేశ భవిష్యత్తు కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నారు. దేశంలోని రాబోయే తరాల కోసం ఈ రోజు ఎంతోమంది హృదయపూర్వకంగా పనిచేస్తున్నారు. ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు. అలాంటి వారి మాటలు చాలామందికి ఓదార్పుగా నిలుస్తాయి.


Also Read: PM Modi: జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా.. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్


ఈ ఏడాదిలో ఇదే చివరి మన్ కీ బాత్..
తాజాగా ప్రధాని మోదీ ప్రసంగించిన ‘మన్ కీ బాత్’ 84వ ఎడిషన్. ఈ ఏడాది ఇదే చివరిది. ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ఉధయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా రేడియో (AIR), దూరదర్శన్‌కు సంబంధించిన అన్ని నెట్‌వర్క్‌లలో, మొబైల్ యాప్‌లో కూడా ప్రసారం చేస్తారు. మన్ కీ బాత్ తొలి ప్రోగ్రామ్ మొదటి ఎపిసోడ్ 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రసారం అయింది. 


వరుణ్ సింగ్ ప్రత్యేక లేఖ ప్రస్తావన
తమిళనాడు హెలికాప్టర్ ఘటనలో భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ స్కూల్ పిల్లల కోసం రాసిన లేఖ గురించి ప్రధాని మాట్లాడారు. పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ప్రోత్సహించాలని తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపల్‌కు వరుణ్ సింగ్ గతంలో లేఖ రాశారు. ఈ లేఖను ప్రధాన మంత్రి తాజాగా తన మన్‌ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. గ్రూప్ కెప్టెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నప్పుడు తాను సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాన్ని చూశానని వివరించారు. వరుణ్ సింగ్ తాను చదివిన పాఠశాల ప్రిన్సిపల్‌కు రాసిన లేఖ అద్భుతంగా ఉందని తెలిపారు.


‘‘సాధారణంగా క్లాసులో యావరేజ్ స్టూడెంట్ ఏమీ సాధించలేడనే భ్రమలు ఉంటాయని, ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చునని గ్రూప్ కెప్టెన్ స్థూలంగా విద్యార్థులకు తెలిపారు. 12వ తరగతి చదువుతున్నప్పుడు నేను యావరేజ్ స్టూడెంట్‌ను. ఫస్ట్ డివిజన్ ర్యాంకు సాధించడం చాలా కష్టం నాకు. చదువులోనే కాదు.. క్రీడలు, ఇతర అంశాల్లోనూ నేను యావరేజ్ స్టూడెంట్‌నే. కానీ, వైమానిక రంగంలో సేవలు అందించాలని, విమానాలపై నాకు ఎంతో తపించేవాడిని. నేను యావరేజ్ స్టూడెంట్‌ను కాబట్టి.. ఏదో సాధిస్తాననే నమ్మకం నాలో ఎప్పుడూ కలిగేది కాదు. ఫైటర్ స్క్వాడ్రన్‌లో నేను తొలిసారిగా యువ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్‌గా బాధ్యతలు తీసుకున్నాక నా అభిప్రాయాలు ఒక్కసారిగా మారిపోయాయి. నా తనువు, మనస్సు పనిపై లగ్నం చేసి ఈ స్థాయికి చేరాను’’ అని వరుణ్ వివరించారని ప్రధాని ప్రస్తావించారు.


Also Read: Mother Love: సమాధి తవ్వి తల్లి మృతదేహం బయటికి తీసిన కొడుకు.. ఇంటికి తెచ్చి దాచుకుని..


Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి