విశ్వం గుట్టు తెలుసుకునేందుకు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగించింది. 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా శనివారం ప్రయోగించింది. విశ్వం గుట్టు ఛేదించేందుకు భూమి నుంచి బయలు దేరింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ స్పేస్‌పోర్ట్ నుంచి అరియన్ రాకెట్ ద్వారా అబ్జర్వేటరీని నాసా ప్రయోగించింది. కెన్యాలోని మలిండి వద్ద గ్రౌండ్ యాంటెన్నా ద్వారా విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలో చేరింది. అపోలో మూన్ ల్యాండింగ్‌ ప్రయోగం ఆర్కిటెక్ వెబ్ పేరును ఈ టెలిస్కోప్ కు పెట్టారు. వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్‌కు సస్సెసర్ గా ప్రయోగించారు. యూఎస్, యూరోపియన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్న ఇంజినీర్లు కొత్త అబ్జర్వేటరీని 100 రెట్లు ఎక్కువ శక్తివంతంగా నిర్మించారు.






విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్రెంచ్‌ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. 5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్‌ పనిచేయనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్  టెలిస్కోప్ రూపొందించాయి. 


Also Read: సమాజ్‌వాదీ పార్టీ నేత ఇంటి నిండా నోట్ల గుట్టలే.. లెక్కపెట్టడానికి వారం సరిపోలేదు.. స్టిల్ కౌంటింగ్ !



(Image Credit: NASA)


అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోపు అందించబోయే డేటా, సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త పరిశోధనల కోసం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇచ్చే సమాచారం చాలా కీలకం కానుంది. 1990లో ప్రయోగించిన హబుల్‌ స్పేస్‌ టెలిస్కోపు విశ్వానికి సంబంధించిన అనేక విషయాలను అందించింది. హబుల్ సస్సెసర్ గా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్‌ దశల వారిగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతోంది. 


Also Read: రాజస్థాన్ లో కూలిన ఐఏఎఫ్ మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్... పైలట్ ఆచూకీ కోసం గాలింపు



(Image Credit : NASA)


"జేమ్స్ వెబ్ విశ్వం యొక్క పుట్టుకను తెలుసుకునేందుకు తిరిగి ప్రయాణం ప్రారంభించాడు" అని నాసా ప్రతినిధి రాబ్ నవియాస్ చెప్పారు. టెలిస్కోప్ లిఫ్ట్-ఆఫ్ ను లక్షలాది మంది వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌లో పనిచేశారు. అరియన్ స్పెస్ వెహికల్ ద్వారా ఈ టెలిస్కోప్ ప్రయోగించారు. "వెబ్ ప్రయోగం ఒక అసాధారణ మిషన్. పెద్దగా కలలు కన్నప్పుడు ఏమి సాధించగలం అనేదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ." యూఎస్ స్పేస్ ఏజెన్సీ నిర్వాహకుడు బిల్ నెల్సన్ లిఫ్ట్-ఆఫ్‌కు ముందు చెప్పారు. 



(Image Credit: NASA)


Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి