CJI NV Ramana Speech In Vijayawada: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఏపీ పర్యటన కొనసాగుతోంది. నేడు విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో జరిగిన దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక సభలో పాల్గొని ఎన్వీ రమణ ప్రసంగించారు. న్యాయవ్యవస్థ ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొందని చెప్పారు. తనపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేయకుండా.. ఓ తెలుగువాడిగా శాయశక్తులా పరిధి మేరకు పని చేసి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు. తెలుగు వాడి గౌరవం ఏ మాత్రం తగ్గకుండా, తెలుగు వాడి కీర్తి పతాకాన్ని ఎగురవేస్తానని తెలుగు ప్రజలకు మాటిచ్చారు. 


రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటు చేసిన ‘భారత న్యాయవ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’ అనే కార్యక్రమంలో మాట్లాడుతూ జస్టిస్ లావు వెంకటేశ్వర్లు చేసిన సేవలను కొడియాడారు. ఆయన ఆదర్శాలు, విలువలను కుమారుడు జస్టిస్ లావు నాగేశ్వరరావు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్వగ్రామంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్య పట్ల అవగాహన పెంచారు. నాణ్యమైన విద్యతో యువతకు, సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని భావించిన వ్యక్తి అని ఎన్వీ రమణ తెలిపారు. క్రీడలతో యువతలో స్ఫూర్తి నింపారని, ఆటలతో చదువుపై మక్కువ పెరగడానికి తన వంతుగా శ్రమించారని గుర్తుచేశారు.


భారతదేశం 1990 దశకం తొలినాళ్లలో ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అయినా కీలక నిర్ణయాలతో పరిస్థితి గాడిన పడింది. ఆర్థిక సంస్కరణలు, విదేశీ పెట్టుబడులతో భారత్ మళ్లీ పుంజుకుందన్నారు. న్యాయవ్యవస్థ సైతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగుతుందని.. రాజ్యాంగ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇటీవల ఆర్బిటరేషన్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించిన సందర్భంలోనూ న్యాయవ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు వర్గాల వారు శాంతియుతంగా చర్చించుకుని సమస్యను సామరస్యకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఏళ్ల తరబడి టైమ్ వేస్ట్ అవుతుందని.. ప్రతి విషయాన్ని కోర్టుల్లోనే తేల్చుకోవాలనుకోవడం సరైన విధానం కాదని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 
Also Read: CJI NV Ramana : సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా ఆహ్వానించిన సీఎం జగన్ ! 
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ? 
Also Read: Omicron Cases In AP: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి