India Last Village People Eat in One Country and Sleep in Another : ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో కొఠియా గ్రామాలు ఉంటాయి. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవో ఇప్పటికీ క్లారిటీ ఉండదు. తమ వంటే తమవని రెండు రాష్ట్రాలు చెబుతూ ఉంటాయి. రెండు రాష్ట్రాల స్కూళ్లు .... పథకాలు అమలవుతూ ఉంటాయి. ఓట్లు కూడా రెండు రాష్ట్రాల్లో వేస్తారు. వీరి ఇళ్లు.. ఏపీలో ఉంటే.. పొలాలు మాత్రం ఒడిషాలో ఉంటాయి. ఇలా కన్ఫ్యూజింగ్ రాష్ట్రాల సరిహద్దులోనే ఉంటే.. ఇక దేశాల సరిహద్దులో ఉంటే ఎలా ఉంటుంది ?
భారత్ చిట్ట చివరి గ్రామంగా చెప్పుకునే గ్రామ ఇండియా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంటుంది. ఆ గ్రామం పేరు లోంగ్వా. భౌగోళికంగా నాగాలాండ్ పరిధిలోకి వస్తుంది. అక్కడి గిరిజనులు నివసిస్తూంటారు. వారు నిద్రపోవడానికి ఓ చోట వంట వండుకోడానికి మరో చోట చిన్న చిన్న చిన్న చిన్న గుడిసెల్లాంటివి నిర్మించుకుని ఉంటారు. అందుకే.. .ఇండియాలో వంట వండుకుని తిని.. నిద్రపోవడానికి యమన్మార్ వెళ్తారని చెప్పుకుంటారు. సరిహద్దులో సగం ఇటు.. సగం అటు ఈ గ్రామం ఉంటంది. ఇక్కడి ప్రజలకు రెండు దేశాల్లో పౌరసత్వం ఉంటుంది. ఓట్లు కూడా ఉంటాయి.
రెండున్నర లక్షలకు ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం - ఈ బీహార్ యువకుడు ఇలా బుక్కైపోయాడు !
ఇక్కడ గిరిజన సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సర్పంచ్‌గా ఉండే వ్యక్తి కింద కొన్ని గ్రామాలు ఉంటాయి. అతనికి ఉన్న ప్రత్యేకాధికారం.. అరవై మందిని పెళ్లి చేసుకునే అవకాశం ఉండటం. ఎవరూ అభ్యంతర పెట్టరు కూడా. అది సంప్రదాయం కావడంతో చీఫ్ గా ఉండే వ్యక్తి తన గరిష్ట అవకాశాన్ని వినియోగించుకుంటాడు. ప్రస్తుతం చీఫ్ గా ఉన్న వ్యక్తికి అరవై మంది భార్యలు ఉన్నారు. అలా అని వీరంతా ప్రశాంతంగా బతుకుతున్నారని అనుకోలేం. ఎందుకంటే.. గిరిజన గ్రామాల మధ్య అప్పుడప్పుడూ యుద్ధాలు కూడా జరుగుతూంటాయి. ఇక్కడ గ్రామాల మధ్య యుద్ధమంటూ జరిగితే ప్రత్యర్థిని చంపి తల తీసుకు రావడమే అసలు విజయం గా భావిస్తారు.అందుకే చాలా వయోలెంట్ గా ఉంటాయి వారి పోరాటాలు.
కార్ కొన్నంత ఈజీగా 1000 కోట్ల విమానం కొన్నాడు - అలాంటిది దేశంలో మరోటి లేదు
పర్వతాల మధ్య ఆహ్లాదంగా ఉండే లోంగ్వా గ్రామంలో లోక్ సభ , నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేస్తారు. భారత్ చివరి గ్రామానికి కూడా కరెంట్ సౌకర్యాన్ని కల్పించింది. వారికి మయన్మార్ సభ్యత్వం ఉన్నప్పటికీ భారతీయులుగా ఉండటానికే ప్రాధాన్యం ఇస్తారు. అక్కడికి టూరిజం కూడా ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది.