Bihar Young man caught riding a bike in Police uniform : పోలీస్ యూనిఫాంలో బైక్ పై తిరిగేస్తున్న మిథిలేష్ మాంఝీ యువకుడ్ని బీహార్ లోని జాముయ్ పోలీసులు  పట్టుకున్నారు. చిన్న పిల్లలప్పుడు పోలీస్ యూనిఫాం కొనుక్కుంటే సరదాగా ఉంటుంది కానీ.. ఈ వయసులో పోలీస్ డ్రెస్ కొనుక్కుని వేసుకుంటే  మోసం కిందకేసు పెడతారని సున్నితంగా హెచ్చరించారు. అత్యంత అమాయకంగా కనిపిస్తున్న  ఆ యువకుడు తానే ఐపీఎస్ ఆఫీసర్నని ఎదురుదాడికి దిగాడు. ఎలా చూసినా ఐపీఎస్ కాదు కదా కనీసం కానిస్టేబుల్ అయ్యే పర్సనాలిటీ కూడా లేదు కదా అని పోలీసులకు డౌట్ వచ్చింది. కానీ  ఆ కాన్ఫిడెన్స్ మాత్రం.. వారికి  అతను ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉండవచ్చేమో అనిపించేలా చేసింది. అంత నమ్మకంగా ఉన్నాడు మరి.                        


లంచం కోసం సీబీఎస్‌ఈ స్కూల్‌లో ఎంఈవో తనిఖీలు-డోర్ కొట్టిన ఏసీబీ అధికారులు


ఇదేందో తేల్చాల్సిన కేసేనని పోలీస్ స్టేషన్‌కు ఆ యువకుడ్ని పట్టుకుపోయి అంతా ఆరా తీశారు. చివరికి తేలిందేమిటంటే... ఆ యువకుడు ఐపీఎస్ ఆఫీసర్ పోస్టును కొనుక్కున్నాడట. ఇటీవల ఓ జలపాతం వద్దకు టూర్ కు వెళ్లినప్పుడు అక్కడ నిళ్లలో స్నానం చేస్తూండగా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. మనీ సినిమాలో తనికెళ్ల భరణిలా మాటలు చెప్పి బురిడీ కొట్టించడంలో మాణిక్యంలాగా ఉండటంతో వెంటనే ఈ యువకుడు ఫ్లాటైపోయాడు. తనకు అందరూ తెలుసని .. ఇట్టే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. కింది స్థాయి ఉద్యోగం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ పోస్టు వరకూ ఏది కావాలో కోరుకోవాలన్నాడు. వెంటనే మిథిలేష్ మాంఝీ ఐపీఎస్ ఆఫీసర్ పోస్టు కోరుకున్నాడు.             


కాసేపు ఫోన్లు మాట్లాడినట్లుగా నటించిన మోసగాడు.. రెండున్నర లక్షలకు ఐపీఎస్ ఉద్యోగం వస్తుందని.. రెండున్నర రోజుల్లోనే తెచ్చివ్వాలన్నాడు. ఆ యువకుడు బంధువుల్ని వేధించి .. వెంటాడి.. రెండున్నర లక్షలు అప్పు తీసుకొచ్చి ఖచ్చితంగా రెండు రోజుల్లో మోసగాడికి ఇచ్చాడు. ఇక ఉద్యోగం వచ్చేసినట్లే అని.. పోలీస్ యూనిఫాంచేతిలో పెట్టి వెళ్లిపోాయడు ఆ మోసగాడు. ఈ మిథిలేష్ ఇక తనకు ఉద్యోగం వచ్చినట్లేనని.. ఆ యూనిఫాం వేసుకుని  బైక్ పై రోడ్ల మీద తిరిగిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా అతనికి మైకం దిగలేదు. తాను ఐపీఎస్ ఆఫీసర్ననే చెబుతున్నాడు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.                      


36 లక్షలు చెల్లిస్తే రోజుకు రూ.1.50 లక్షల వడ్డీ- శ్రీకాకుళంలో ఫైనాన్స్ సంస్థ టెంప్టింగ్ ఆఫర్


పోలీసులు అతని కుటుంబసభ్యులను పిలిపించారు. తండ్రి లేడని..తల్లే కష్టపడి పోషిస్తోందని తెలిపారు. మోసగాళ్లకు ఇచ్ేచందుకు రెండున్నర లక్షలను.. బంధువుల దగ్గర అప్పులు చేసినట్లుగా తేల్చారు. అయితే పోలీసులు జాలి చూపించలేదు. అమాయకుడికి నిజం తెలియాలన్నాకేసు పెట్టాల్సిందేనని.. కేసు పెట్టి లోపలికి  పంపేశారు.