Indian Family Buying House In Limerick : సొంత ఇల్లు అంటే భారతీయులకు ఓ ఎమోషన్. అది సొంత ఊళ్లో అయినా ఉపాధి కోసం ఉంటున్న ఊళ్లో అయినా. అందుకే ప్రపంచవ్యాప్తంగా భారతీయులు తమ సంపాదనలో ఎక్కువగా ఇళ్లు, పొలాల మీదే పెట్టుబడి పెడతారని చెబుతారు. ఇలా ఐర్లాండ్‌లో నివసిస్తున్న ఓ భారతీయ కుటుంబం అక్కడి లిమెరిక్ అనే పట్టణంలో ఇల్లు కొనుగోలు చేసింది. తమ నేమ్ ప్లేట్‌ను ఇంటికి తగిలించుకుంటున్న సమయంలో ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన మైకెలో కెఫీ అనే వ్యక్తి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఇండియన్స్ మరో ఇల్లు కొన్నారని నూట యభై కోట్ల మంది ఉన్న జనాభా దేశం నుంచి వచ్చిన వారు చిన్నదైన ఐర్లాండ్ లో కాలనీలు పెట్టేసుకుంటున్నాని విమర్శించారు.   



 

ఐర్లాండ్‌లో ఇల్లు కొన్నవారు దక్షిణాదికి చెందిన వారు. లుంగీలతో ఉన్నారు. బహుశా తమిళనాడు వారు అయి ఉంటారని భావిస్తున్నారు. ఈ రకంగా  వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన మైకెలో వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరు. గతంలో ఆయన ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేశారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాతనే మళ్లీ రీస్టోర్ చేశారు. అయినా ఆయన తీరు మార్చుకోలేదు. 


మైకెలో ట్వీట్ పై సోషల్ మీడియా మండిపడింది. ఆయన ఐర్లాండ్ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడి నేరం చేశారని.. ఆయనపై ఫిర్యాదు చేస్తున్నట్లుగా కొంత మంది ప్రకటించారు.  



 

మైకెలో లాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరమమని.. డైవర్సిటీ వల్ల ప్రపంచం మొత్తం  లాభపడుతోందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఇలా ఏడవడం కన్నా ఏదో ఓ పని చేసి సంపాందిచుకుని ఇల్లు కొనుక్కోవాలని మరికొంత మంది సలహాలు ఇచ్చారు. 





 
మైకోలో లాంటి జాతి వివక్ష గల వ్యక్తులు అన్నిచోట్లా ఉంటారని వారిని  కంట్రోల్ పెట్టాలన్న అభిప్రాయం ఎక్కవ మంది  వినిపించారు.