నందమూరి, నారా కుటుంబాలకు... హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూ ఎన్టీఆర్ (Jr NTR)కు మధ్య దూరం ఉందని ప్రచారం జరుగుతోంది. వారి మధ్య అనుబంధం గురించి ఓ వర్గం ఎప్పుడూ దుష్ప్రచారం చేస్తుంది. అయితే, 'దేవర' (Devara Movie) విడుదల సందర్భంగా అటువంటి పుకార్లకు మరోసారి చెక్ పడింది.
ఏపీలో 'దేవర'కు స్పెషల్ షోలు, టికెట్ హైకులు!
ఏపీలోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ. 135, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 110 నుంచి రూ. 60 వరకు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది ప్రభుత్వం. సెప్టెంబర్ 26 మిడ్ నైట్ తర్వాత... అంటే 27వ తేదీన తెల్లవారుజాము నుంచి బెనిఫిట్ షోలకు... ఆ తర్వాత తొమ్మిది రోజుల పాటు రోజుకు ఐదు ఆటలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది.
నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ సినిమాల పట్ల వైఖరి ఎలా ఉంటుందనే చర్చ కొందరి మధ్య జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల జగన్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలు తీసుకున్న నేపథ్యానికి తోడు నందమూరి - నారా ఫ్యామిలీలతో ఎన్టీఆర్ దూరం అనే ప్రచారం వల్ల ఆ చర్చ వచ్చింది. జగన్ ప్రభుత్వ చర్యలకు, చంద్రబాబుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని ప్రేక్షకులతో పాటు సామాన్య ప్రజలకు క్లారిటీ వచ్చింది. 'దేవర'కు ఏపీ ప్రభుత్వం ఆంక్షలు పెట్టలేదు. స్పెషల్ షోస్ నుంచి టికెట్ రేట్స్ వరకు వెసులుబాటు ఇచ్చింది.
చంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్!
టికెట్ రేట్స్, స్పెషల్ షోస్ గురించి పర్మిషన్ వచ్చిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి, తమ మావయ్య నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు మేనల్లుళ్లు జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్ చెప్పారు.
Also Read: వెంకటేష్ సినిమా సెట్స్‌లో బాలకృష్ణ సందడి - ఆ స్మైలూ, ఎఫెక్షనూ సూపరంతే
'దేవర'లో ఎన్టీఆర్ హీరోగా నటించగా... ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరించారు. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబందించిన థియేట్రికల్ రైట్స్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మినిష్టర్ కందుల దుర్గేష్ లకు థాంక్స్ చెప్పారు. చంద్రబాబు నాయుడుకు ఎందుకు థాంక్స్ చెప్పలేదని పలువురు విమర్శించారు. తప్పు అనుకోండి, లేదంటే పొరపాటు అనుకోండి - నాగవంశీ వెంటనే సరి చేసుకున్నారు. చంద్రబాబుకు స్పెషల్ థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
Also Read: సుకుమార్ భార్య తబిత బర్త్ డే సెలబ్రేషన్స్... ఫారిన్‌లో చీర కట్టారు, ఎక్కడున్నారో తెలుసా?
నాగవంశీ తప్పును ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ రిపీట్ చేయలేదు. వాళ్లిద్దరూ ముందు చంద్రబాబు పేరు తమ తమ ట్వీట్లలో రాశారు. ఆ తర్వాత పవన్, దుర్గేష్ పేర్లు పేర్కొన్నారు. అయితే... చంద్రబాబును మావయ్య అని కాకుండా గారు అని పేర్కొనడం గమనార్హం. సినిమా పరంగా కనుక మావయ్య అని ట్వీట్ చేయలేదని, ఒకవేళ మావయ్య అని గనుక అంటే సొంత కుటుంబ సభ్యుల సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారని విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. 'దేవర'కు ముందు 'కల్కి 2898 ఏడీ' సినిమాకూ ఏపీ ప్రభుత్వం ఇదే విధంగా వెసులుబాటు ఇచ్చింది. ఇప్పుడూ తమ పంథా మార్చుకోలేదు.